Farmers Protest: అలాంటప్పుడు పోలీసులు-రైతుల మధ్య ఒప్పందం ఎందుకు.. కేంద్రంపై సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ఫైర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ..,

Farmers Protest: అలాంటప్పుడు పోలీసులు-రైతుల మధ్య ఒప్పందం ఎందుకు.. కేంద్రంపై సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ఫైర్‌
Follow us

|

Updated on: Jan 26, 2021 | 5:07 PM

Farmers tractor rally Live Updates: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు నగరం నలువైపుల నుంచి దూసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులు రైతులపై లాఠిచార్జ్‌ చేయడంతోపాటు, బాష్ఫవాయు గోళాలను సైతం ప్రయోగించారు. కాగా.. ట్రాక్టర్ ర్యాలీతో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు లాఠిచార్జ్‌ చేయడంతోపాటు బాష్ఫవాయు గోళాలు ప్రయోగించడంపై సీపీఐ (ఎం) కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పలు ప్రశ్నలు సంధిస్తూ కేంద్రాన్ని నిలదీశారు.

రైతులపై బాష్ఫవాయు గోళాలు ప్రయోగించడం, లాఠిచార్జ్‌ చేయడం సరికాదని సీతారం ఏచూరి పేర్కొన్నారు. అలాంటప్పుడు రైతులు, ఢిల్లీ పోలీసుల మధ్య చర్చలు, ఒప్పందం ఎందుకని.. ప్రభుత్వం ఎందుకు గొడవను పెంచుతోందని ఆయన ప్రశ్నించారు. రైతులు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీని కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేసి డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ఓ వీడియోను షేర్‌ చేశారు.

Read Also:రైతుల ఆందోళనపై సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విచారణ.. క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్న ధ‌ర్మాస‌నం. Read also:సర్కార్‌పై ఆగ్రహించిన అన్నదాత… తమను అడ్డుకునే బారేకెడ్‌గా పెట్టిన భారీ ట్రక్‌ను ట్రాక్టర్‌తో లాగిపాడేశారు..