సర్కార్‌పై ఆగ్రహించిన అన్నదాత… తమను అడ్డుకునే బారేకెడ్‌గా పెట్టిన భారీ ట్రక్‌ను ట్రాక్టర్‌తో లాగిపాడేశారు..

కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంగా పెట్టిన భారీ ట్రక్‌ను తమ ట్రాక్టర్లతో లాగిపాడేశారు

సర్కార్‌పై ఆగ్రహించిన అన్నదాత... తమను అడ్డుకునే బారేకెడ్‌గా పెట్టిన భారీ ట్రక్‌ను ట్రాక్టర్‌తో లాగిపాడేశారు..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 27, 2020 | 4:23 PM

కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంగా పెట్టిన భారీ ట్రక్‌ను తమ ట్రాక్టర్లతో లాగిపాడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ‘ఛలో ఢిల్లీ’ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీకి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు.

రైతుల ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఢిల్లీ సరిహద్దుల్లోనే రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. భారీకేడ్లను ఏర్పాటు చేశారు. లాఠీచార్జి చేసి రైతులను చెదరగొడుతున్నారు. సాధ్యమైనంత వరకు రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైతులను నిలువరించేందుకు అడ్డుగా ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రక్కులను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. అయితే అవేవీ తమను అడ్డుకోలేవని నినదించిన రైతులు.. తమ ట్రాక్టర్లతో ఆ ట్రక్కును లాగిపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రైతుల ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం సైతం తాము రైతుల వెంటే అని స్పష్టమైన ప్రకటన చేశారు.