India Coronavirus: దేశంలో 16 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలంటే..?

గత 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

India Coronavirus: దేశంలో 16 వేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలంటే..?
Coronavirus

Updated on: Aug 08, 2022 | 10:00 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,35,510 (0.31 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 6.14 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,26,730 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 15,549 మంది కోలుకున్నారు.
  • వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659 కి చేరింది.
  • దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 206.56 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
  • దేశంలో నిన్న 34,75,330 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us