ఇన్వెస్టిగేషన్ సమాచారాన్ని లీక్ చేయరాదని పోలీసులను ఆదేశించండి, ఢిల్లీకోర్టుకెక్కిన దిశారవి

తమ ఇన్వెస్టిగేషన్ సమాచారాన్ని లీక్ చేయరాదని పోలీసులను ఆదేశించాల్సిందిగా కోరుతూ క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి ఢిల్లీహైకోర్టును కోరింది.

ఇన్వెస్టిగేషన్ సమాచారాన్ని లీక్ చేయరాదని పోలీసులను ఆదేశించండి, ఢిల్లీకోర్టుకెక్కిన దిశారవి

Edited By: Anil kumar poka

Updated on: Feb 18, 2021 | 4:01 PM

తమ ఇన్వెస్టిగేషన్ సమాచారాన్ని లీక్ చేయరాదని పోలీసులను ఆదేశించాల్సిందిగా కోరుతూ క్లైమేట్ ఛేంజ్ యాక్టివిస్ట్ దిశారవి ఢిల్లీహైకోర్టును కోరింది. ఈ మేరకు ఆమె  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.అలాగే తన ప్రైవేట్ ఛాటింగులోని కంటెంట్లను కూడా ఖాకీలు బయటకు పొక్కనివ్వకుండా చూడాలని, కొన్ని ప్రైవేట్ టీవీ ఛానల్స్ తన వాట్సాప్ సంభాషణలను ప్రసారం గానీ, పబ్లిష్ గానీ చేయకుండా నిషేధం విధించాలని కూడా ఆమె అభ్యర్థించింది. ఆ ఛానల్స్ ని కట్టడి చేయాలని కోరింది. ఈ ఛానెల్స్ కేబుల్ టీవీ నెట్ వర్క్ నిబంధనలను అతిక్రమిస్తున్నాయని, మీడియాకు ఇన్వెస్టిగేషన్ సమాచారాన్ని లీక్ చేయడం ప్రైవసీ, ప్రతిష్టకు సంబంధించిన హక్కులను ఉల్లంఘించడమే అని దిశారవి పేర్కొంది. ఢిల్లీ పోలీసులు రాజ్యాంగంలోని 21 వ ఆర్టికల్ ను యధేచ్చగా అతిక్రమిస్తున్నారని ఆమె ఆరోపించింది.

దిశారవి తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ అఖిల్ సిబల్..తన క్లయింటును పోలీసులు అరెస్టు చేసిన మరుసటి రోజునుంచే టీవీ ఛానెల్స్ అదేపనిగా ఆమె ఛాట్లపై రిపోర్టింగ్ చేస్తూ వచ్చాయన్నారు. కేంద్రం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. దిశారవి వేసిన  పిటిషన్ మీడియా అటెన్షన్ ని కొరుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పోలీసులు తమ సమాచారానికి సంబంధించి ఎలాంటి అంశాలనూ  లీక్ చేయకుండా చూస్తానని, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసిన కోర్టు- ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

CM KCR Rare And Old Photos: అలుపెరుగని యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరుదైన మధురస్మృతులు.

Man rapes dog in Mysuru act caught on camera Video: వీడు మనిషేనా ? వీధి కుక్కపై లైంగిక దాడి.

IPL Auction 2021 Photos: ఐపీఎల్ 2021 సీజన్ వేలం.అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్