ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారాని(Rape)కి పాల్పడిన కేసులో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తరప్రదేశ్ లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. మథుర(Mathura) ప్రాంతంలో 2018లో ఐదేళ్ల చిన్నారిపై ఓ మైనర్(Minor) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, అమ్మమ్మ బయటకు వెళ్తూ సూరజ్ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారిని వదిలి వెళ్లారు. ఈ సమయంలో సూరజ్ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి తిరిగి వచ్చిన తర్వాత.. చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు. కొద్ది సేపటి తరువాత బాలిక వాంతులు చేసుకున్నట్లు ఆమె అమ్మమ్మ గుర్తించింది. అనారోగ్యంతో బాధపడుతుందని భావించి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం తనపై సూరజ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని చిన్నారి తన తల్లి,అమ్మమ్మలకు తెలిపింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన సూరజ్ పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన స్థానిక కోర్టు.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. విచారణ సమయంలో నిందితుడు జైలులో ఉన్న సమయాన్ని కూడా ఇందులో లెక్కకడుతున్నట్లు తెలిపింది. సూరజ్తరఫు న్యాయవాది.. బాలునికి శిక్ష తగ్గించాలని కోరారు. అయితే చేసిన తప్పు చాలా తీవ్రమైనదనది డిఫెన్స్లాయర్ వాదించారు. వీరి వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
Also Read
Russia Ukraine War Live: కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా.. ఆర్మీలో చేరిన టెన్నిస్ ప్లేయర్
Mallu Bhatti Vikramarka: నేటి నుంచి భట్టి పాదయాత్ర.. పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లోకి..
Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!