టాక్సీలో ఆరేళ్ల కొడుకును మర్చిపోయిన తల్లిదండ్రులు

| Edited By: Anil kumar poka

Oct 29, 2020 | 6:31 PM

చోద్యం కాకపోతే టాక్సిలో ప్రయాణిస్తూ ఎవరైనా పిల్లోడిని మర్చిపోతారా చెప్పండి..? మర్చిపోవడానికి చిన్నపిల్లోడేమైనా బ్యాగా..తాళం చెవా అనే ప్రశ్నలు వేయకండి..

టాక్సీలో ఆరేళ్ల కొడుకును మర్చిపోయిన తల్లిదండ్రులు
Follow us on

చోద్యం కాకపోతే టాక్సిలో ప్రయాణిస్తూ ఎవరైనా పిల్లోడిని మర్చిపోతారా చెప్పండి..? మర్చిపోవడానికి చిన్నపిల్లోడేమైనా బ్యాగా..తాళం చెవా అనే ప్రశ్నలు వేయకండి.. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఫ్యామిలీ ఓ ఆరేళ్ల బాలుడిని టాక్సీలో మర్చిపోయింది కాబట్టి… కోల్‌కతా నుంచి లక్నోకు విమానంలో వెళ్లేందుకు ఓ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌కు టాక్సీలో వెళ్లింది.. ఫ్లయిట్‌ టైమ్‌ అవ్వడంతో గబగబా కారులోంచి లగేజి దించుకుంది.. కారులో తమ ఆరేళ్ల చిన్నారి ఉన్నాడన్న సంగతి మర్చిపోయి వేగంగా ఎయిర్‌పోర్ట్‌ లోపలికి వెళ్లారు.. విమానం ఎక్కేసి లక్నోలో దిగారు..దిగేసి ఇంటికి కూడా వెళ్లారు.. అప్పుడు కానీ తెలియలేదు వారికి పిల్లోడు లేడని! ఆలోచించగా అసలు టాక్సీలోంచి దింపనే లేదన్న విషయం స్ఫురించింది.. వెంటనే టాక్సీ బిల్లుపై ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కోల్‌కతా ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించారు.. తమ ఆరేళ్ల కొడుకును టాక్సీలోనే మర్చిపోయి ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్పారు.. ఎలాగైనా సరే తమ కొడుకును కాపాడమంటూ వేడుకున్నారు. అలెర్టయిన ట్రాఫిక్‌ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌ అధికారులను సంప్రదించారు. అక్కడ నమోదైన టాక్సీ నంబర్‌ ఆధారంగా డ్రైవర్‌తో మాట్లాడారు.. వెనుక సీటులో బాలుడు ఉన్నాడో లేడో చెక్‌ చేయమన్నారు.. డ్రైవర్‌ వెనక్కి తిరిగి చూస్తే ఏముంది.. ఆ బాలుడు వెనుక సీటులో హాయిగా నిద్రపోతున్నాడు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనందపడ్డారు.. డ్రైవరేమో ఆశ్చర్యపోయాడు.. ఆ బాలుడిని ఎయిర్‌పోర్ట్‌ అధికారుల దగ్గరకు చేర్చాడు. 14 ఏళ్లుగా డ్రైవర్‌ వృత్తిలో ఉంటున్నానని, ఎవరూ ఇలా పిల్లోడిని మర్చిపోయి వెళ్లలేదని అన్నాడు. ఆనక ఆ చిన్నారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు అధికారులు.. దీంతో కథ సుఖాంతం అయ్యింది..