Election Commission: లోక్ సభ ఎన్నికలకు సిద్దమైన దేశం.. తొలివిడతలో 102 నియోజకవర్గాలకు పోలింగ్..

దేశంలో తొలివిడత పోలింగ్‌ కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీకి కూడా పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం గం. 7.00 నుంచి సాయంత్రం గం. 6.00 వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. తొలి విడత పోలింగ్‌లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Election Commission: లోక్ సభ ఎన్నికలకు సిద్దమైన దేశం.. తొలివిడతలో 102 నియోజకవర్గాలకు పోలింగ్..
Lok Sabha Elections
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:32 PM

దేశంలో తొలివిడత పోలింగ్‌ కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీకి కూడా పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఉదయం గం. 7.00 నుంచి సాయంత్రం గం. 6.00 వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. తొలి విడత పోలింగ్‌లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 8.4 కోట్ల మంది కాగా మహిళలు 8.23 కోట్ల మంది ఉన్నారు. తొలి విడతలో 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లలో 18 లక్షల పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు 35.67 లక్షల మందితో పాటు 20-29 ఏళ్ల వయస్సులో ఉన్న యువ ఓటర్లు 3.51 కోట్ల మందిగా తెలిపారు.

తొలి విడతలో 1,625 మంది అభ్యర్థులు తమ రాజకీయ భవిత్యాన్ని పరిక్షించుకోనున్నారు. అందులో 1,491 మంది పురుష అభ్యర్థులు కాగా.. 134 మంది స్త్రీలు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల విధుల్లో 41 హెలీకాప్టర్లు, 84 స్పెషల్ రైళ్లు, 1 లక్ష ఇతర వాహనాలను వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు, 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. 127 పరిశీలకులు, 67 పోలీస్ అబ్జర్వర్లు, 167 ఖర్చు పరిశీలకులతో కలిపి మొత్తం 361 మంది అబ్జర్వర్లతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించింది. మొత్తం 4,627 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 5,208 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, 2,028 వీడియో సర్వైలెన్స్ టీమ్స్, 1,255 వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 1,374 ఇంటర్-స్టేట్, 162 ఇంటర్నేషనల్ బోర్డర్ చెక్ పోస్టుల ఏర్పాటు చేసి నగదు, డ్రగ్స్, మద్యం తదితర వస్తువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు.

85 ఏళ్లు పైబడిన 14.14 లక్షల మంది ఓటర్లతో పాటు 13.89 లక్షల వైకల్యంతో బాధపడుతున్న ఓటర్లకు ఇంటి నుంచే ఓటింగ్ వేసే సదుపాయాన్ని కల్పించే ప్రక్రియను పూర్తి చేసింది ఈసీ. 85 ఏళ్లు దాటినప్పటికీ పోలింగ్ బూత్‎కు వచ్చి ఓటు వేయాలనుకునేవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకల్యం కల్గిన ఓటర్లకు వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద తాగునీరు, నీడను కల్పించే షెడ్, ర్యాంపులు, వాలంటీర్లు, వీల్ చైర్లు, టాయిలెట్లు, విద్యుత్తు తదితర సదుపాయాలు కల్పించారు ప్రత్యేక అధికారులు. ఇప్పటికే ఓటర్ స్లిప్పులను ప్రతి ఇంటికీ పంపిణీ చేసింది ఎన్నికల సిబ్బంది. ఓటర్ ఐడీ లేనప్పటికీ మరో 12 ఇతర ప్రత్యామ్నాయ ప్రభుత్వ ధృవపత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా అనుమతిస్తామని ప్రకటించింది. ఎన్నికల కవరేజి కోసం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 47,000 మంది మీడియా ప్రతినిధులకు ఈసీ పాసులు మంజూరు చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈసీ ప్రత్యేక వెబ్‌సైట్ https://elections24.eci.gov.in/లో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..