వాట్సాప్‌లో లిస్ట్ పెట్టండి.. డోర్ డెలివరీలో సరకులు పొందండి..!

కరోనా వైరస్ విస్తరణకు బ్రేక్‌లు వేసేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

వాట్సాప్‌లో లిస్ట్ పెట్టండి.. డోర్ డెలివరీలో సరకులు పొందండి..!

Edited By:

Updated on: Apr 22, 2020 | 11:03 AM

కరోనా వైరస్ విస్తరణకు బ్రేక్‌లు వేసేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతేకాదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వినూత్న చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలను ప్రజల ఇంటివద్దకే పంపించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ నంబర్‌ను ప్రభుత్వం కేటాయించింది. సరకులు అవసరం ఉన్నవారు సంబంధిత జాబితాను ఆ నంబర్‌కు పంపిస్తే.. ఆ సరకులను స్థానిక ఏజెంట్లు ఇంటికి తీసుకురానున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం యడియూరప్ప 08061914960 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా బెంగళూరులోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి దాదాపు 5వేల మంది ఏజెంట్లు పని చేయనున్నారని.. దీని వలన నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు.

సరుకులు ఎలా పొందాలంటే..!

1.08061914960 హెల్ప్‌లైన్ నంబర్‌ను HI అని మెసేజ్ పెట్టి.. లొకేషన్‌ లేదా అడ్రస్‌ షేర్ చేయాలి
2.ఆ తరువాత మనకు నిత్యావసరాల సరకులు కావాలంటే నిత్యావసర సరకులు.. మెడిసిన్ కావాలంటే మెడిసిన్ దగ్గర క్లిక్ చేయాలి.
3.కావాల్సిన వస్తువుల జాబితాను టైప్ చేసి గానీ, ఓ పేపర్‌పై రాసి ఆ ఇమేజ్‌ను గానీ పంపాలి.
4.ఆ ఆర్డర్ రిసీవ్‌ చేసుకున్నట్లు రిప్లై వచ్చిన తరువాత ఏజెంట్ వచ్చి సరకులు తీసుకొస్తాడు.
5.సరకులను తీసుకున్నాక బిల్లును చెల్లించాలి. డోర్ డెలివరీ ఛార్జీల కింద అదనంగా రూ.10రోజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ వేళ  స్విగ్గీ ద్వారా పండ్లు, కూరగాయలు డోర్ డెలివరీ చేయాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Read This Story Also: షాకింగ్: ఆ మహిళకు వరుసగా 19 సార్లు కరోనా పాజిటివ్..