కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ముహూర్తం కరారు.. శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా?

భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ముహూర్తం కరారు.. శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో తెలుసా?

Updated on: Dec 09, 2020 | 5:21 AM

భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంతాజాగ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 10 న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపను చేయనున్నారు. కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలతో పాటు 200 మంది ప్రత్యేక అతిథులు కూడా హాజరవుతారని ప్రకటించింది.

సకల సదుపాయాలతో ఈ పార్లమెంట్‌ భవనానని నిర్మిస్తున్నారు. త్రిభుజాకారంలో ఉండే భవనంలో అత్యాధునిక ఇంధన సామర్థ్యం, కట్టుదిట్టమైన భద్రత సౌకర్యాలు అమర్చుతున్నారు. లోక్‌సభ ప్రస్తుత పరిమాణానికి 3 రెట్లు, రాజ్యసభను విశాలంగా నిర్మిస్తున్నారు. భవనం లోపలి భాగంలో ఇండియన్ హిస్టరీని తెలిపే విధంగా సంస్కృతి, కళలు, వస్త్రాలు, వాస్తుశిల్పాలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. నూతన టెక్నాలజీని వాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 2022 వ సంవత్సరంలో జరుపుకేనే 75 వ స్వాతంత్య్ర దినోత్సవానికి కానుకగా అందిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us