ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ గా స్పందించింది. వాలెంటైన్స్ డే ముంచుకొస్తున్న తరుణంలో ‘ కౌగలింతల రోజయిన (హగ్ డే) బుధవారం……… ఒకప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఒక్కసారిగా కౌగిలించుకున్న వీడియోను పార్టీ పోస్ట్ చేసింది. ఇలా ఒకవిధంగా బీజేపీని ఎత్తిపొడిచింది. ‘ ప్రేమని విశ్వసించండి.. ద్వేషాన్ని కాదు’ అన్న కామెంట్ తో కాంగ్రెస్ మళ్ళీ కమలం పార్టీని ‘దువ్వినంత పని ‘ చేసింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు.. ఇలా ఈ పార్టీ స్పందిస్తే.. ఈ సారి అందుకు విరుధ్ధంగా కమలం ‘వాడిపోవడాన్ని’ అదే వీడియోలో వెరైటీగా పోస్ట్ చేసింది. ఇక ప్రేమికుల రోజయిన శుక్రవారం ఈ పార్టీ ఎలా, ఏ ఉద్దేశంతో మోడీని, బీజేపీని ఆట పట్టిస్తుందో చూడాలి. అయితే ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకునే బదులు.. కాంగ్రెస్ ఈ విధంగా అధికార పార్టీతో ‘దోబూచులాడడాన్ని ‘ సీనియర్ నేతలు దుయ్యబడుతున్నారు.
Same message to BJP every year. Hug don’t Hate. #HugDay pic.twitter.com/3yXCzOZzCn
— Congress (@INCIndia) February 12, 2020