మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య పొడిచిన పొత్తులు

| Edited By:

Sep 17, 2019 | 3:14 AM

త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచాయి. ఈ సారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కలిసి పోటీ చేస్తాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఇరు పార్టీలు కలిసి మొత్తం 250 స్థానాల్లో పోటీ చేస్తాయని.. (ఎన్సీపీ 125, కాంగ్రెస్ 125) మిగతా 38 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీలో ఉంటాయన్నారు. మహారాష్ట్రలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 288. అయితే ఏయే స్థానాల్లో ఎవరు పోటీ […]

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య పొడిచిన పొత్తులు
Follow us on

త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచాయి. ఈ సారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కలిసి పోటీ చేస్తాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఇరు పార్టీలు కలిసి మొత్తం 250 స్థానాల్లో పోటీ చేస్తాయని.. (ఎన్సీపీ 125, కాంగ్రెస్ 125) మిగతా 38 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీలో ఉంటాయన్నారు. మహారాష్ట్రలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 288. అయితే ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరికొద్ది రోజుల్లో ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రానుంది. ఇక మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది.