Rahul Dog Biscuit Row: కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల లొల్లి.. రాహుల్ ఏం సమాధానం ఇచ్చారంటే..?

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల గొడవ రాజుకుంది. జార్ఖండ్‌ జోడో యాత్రలో రాహుల్‌ కుక్కలు తినే బిస్కెట్లను కార్యకర్తతో తిన్పించారని బీజేపీ ఆరోపించింది. కుక్కలంటే బీజేపీ నేతలకు ఎందుకు అంత భయం అని రాహుల్‌ ఎదురుదాడికి దిగారు.

Rahul Dog Biscuit Row: కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల లొల్లి.. రాహుల్ ఏం సమాధానం ఇచ్చారంటే..?
Rahul Gandhi Dog Biscuts Contro
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 22, 2024 | 8:15 PM

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ నేతల మధ్య కుక్క బిస్కెట్ల గొడవ రాజుకుంది. జార్ఖండ్‌ జోడో యాత్రలో రాహుల్‌ కుక్కలు తినే బిస్కెట్లను కార్యకర్తతో తిన్పించారని బీజేపీ ఆరోపించింది. కుక్కలంటే బీజేపీ నేతలకు ఎందుకు అంత భయం అని రాహుల్‌ ఎదురుదాడికి దిగారు.

జార్ఖండ్‌ లోని కుంతీలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాహుల్ యాత్రలో భాగంగా జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా విడుదలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ కారు పైకప్పుపై కూర్చుని కుక్కకు బిస్కెట్లు తినిపించారు. కుక్క బిస్కెట్లు తినకపోవడంతో.. పక్కనే ఉన్న ఓ కార్యకర్తకు రాహుల్ బిస్కెట్ ఇచ్చారు. ఈ వీడియో విషయంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సైతంగా ఘాటుగా స్పందించారు.

అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీపై, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వీడియోలో పెంపుడు కుక్కకు బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ.. ఆ కుక్క వాటిని తినకపోవడంతో ఆ బిస్కెట్లను పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఇచ్చారు. అయితే కుక్క బిస్కెట్లను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చి తినమని చెప్తున్నారని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

అయితే ఆ వీడియోలో కనిపించింది.. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న దానికీ అసలు సంబంధమే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు ఆ వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త కానే కాదని తేల్చి చెప్పారు. ఆ వ్యక్తి ఆ కుక్క యజమాని అని తెలిపిన రాహుల్ గాంధీ.. తాను బిస్కెట్లు ఇస్తే ఆ కుక్క తినలేదని, అందుకే వాటిని దాని యజమానికి ఇచ్చి తినిపించాలని సూచించినట్లు వెల్లడించారు. దానికి బీజేపీ నేతలు అసత్య ప్రచారాలకు తెరతీశారని ఎదురుదాడి చేశారు.

కుక్క చాలా కంగారుగా ఉందని.. భయంతో వణికి పోతోందని రాహుల్ గాంధీ తెలిపారు. ఆ సమయంలో తాను బిస్కెట్లు తినిపించేందుకు ప్రయత్నిస్తే అది చాలా భయపడిందని పేర్కొన్నారు. అందుకే తాను ఆ బిస్కెట్లను ఆ కుక్క యజమానికి ఇచ్చి.. తినిపించాలని సూచించినట్లు చెప్పారు. . కుక్కలపై బీజేపీకి ఎందుకు అంత కోపమో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కుక్కలు బీజేపీ ఎలా హాని జరిగిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆ కుక్క చాలా భయపడింది. నేను బిస్కెట్‌ ఇస్తే భయపడి తినలేదు. అప్పుడు కుక్క యాజమానికి బిస్కెట్‌ ఇచ్చా. ఆయన్నే బిస్కెట్‌ను తిన్పించాలని కోరా… ఆయన తిన్పిస్తే కుక్క తీసుకుంది. ఇందులో వివాదం లేదు. బీజేపీ నేతలకు కుక్కలంటే ఇంత కోపం ఎందుకో అర్ధం కావడం లేదు. కుక్కలు ఏ పాపం చేశాయి అన్నారు రాహుల్.

అయితే బీజేపీ నేతలు.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కుక్కలు తినే బిస్కెట్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఇచ్చారని ఆరోపించారు. అందుకు ఆ కార్యకర్త తిరస్కరించారని తెలిపారు. ఇక ఇదే వ్యవహారంలోకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా రంగంలోకి దిగారు. గతంలో తనకు జరిగిన ఓ సంఘటనను హిమంత బిశ్వ శర్మ గుర్తు చేసుకున్నారు. ఒకసారి రాహుల్ గాంధీతో సమావేశం సందర్భంగా తనతోపాటు సీనియర్ నేతలు ఉన్నారని.. అయితే ఆ సమయంలో కుక్కకు వేసిన బిస్కెట్ల ప్లేట్‌లో బిస్కెట్లను తమకు ఇచ్చినట్లు తెలిపారు. కానీ తాను వాటిని తిరస్కరించి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?