మన హీరోల లైనప్ చేస్తూ గూస్ బంప్స్ రావాల్సిందే.. 

TV9 Telugu

20 May 2024

మొదటిగా ప్రభాస్ విషయానికి వస్తే కల్కి 2898 ఏడి, రాజా సాబ్, సాలార్ 2, స్పిరిట్, కన్నప్పతో సహా హను రాఘవాపుడితో ఓ సినిమా ఉంది.

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఉన్నాయి. వీటితో పాటు సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయనున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా 4 సినిమాలు లైన్ లో పెట్టారు. అవేంటంటే దేవర 1, దేవర 2, వార్ 2, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31.

రామ్ చరణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి గేమ్ చెంజర్ కాగా బుచ్చిబాబు తో ఒకటి, సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. అవి పుష్ప 2, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ సినిమాలు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకో సినిమాకి అయన సైన్ చెయ్యలేదు.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. దీంతో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.