Rahul Gandhi t-shirt: ఇదిగో బ్రాండ్.. ఇదే దాని ధర.. రాహుల్ వేసుకున్న ఈ టీ షర్ట్ ధర రూ.41 వేలు.. సోషల్ మీడియాలో బీజేపీ విమర్శలు..

|

Sep 09, 2022 | 6:24 PM

రాహుల్ గాంధీపైనే చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ధరించిన టీ షర్ట్ ధర విషయంలో సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. ఇదే

Rahul Gandhi t-shirt: ఇదిగో బ్రాండ్.. ఇదే దాని ధర.. రాహుల్ వేసుకున్న ఈ టీ షర్ట్ ధర రూ.41 వేలు.. సోషల్ మీడియాలో బీజేపీ విమర్శలు..
Rahul Gandhi Wore A T Shirt
Follow us on

‘భారత్ జోడో యాత్ర’పై  చర్చకంటే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపైనే చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ధరించిన టీ షర్ట్ ధర విషయంలో సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. ఇదే అంశంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. పాదయాత్రలో రాహుల్ గాంధీ వైట్ టీ షర్ట్ ధరించి కనిపించారు. ఆయన ధరించిన టీ షెర్ట్‌పై బర్‌బెర్రీ బ్రాండ్‌ కనిపించింది. ఆ టీ షర్ట్‌ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరుంది. అంతే కాదు బెర్‌బెర్రీ బ్రాండ్‌ చాలా ఖరీదైనది కావడంతో అంతా అదే అంశంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ టీ షర్ట్ ధర రూ.41,000 అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ పోస్టులు పెడుతోంది.

రాహల్ చేస్తున్నది ‘భారత్ జోడో’ కాదు ‘భారత్ దేఖో’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రాహుల్ ఖరీదైన టీ షర్ట్ ధరించారని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ట్వీట్ చేసింది. అయితే, బీజేపీ చేస్తున్న కామెంట్స్‌ను తిప్పికొట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు కాంగ్రెస్ మీడియా సెల్.

భారత్ జోడో యాత్ర సందర్భంగా  ప్రజా స్పందనను చూసి బీజేపీ భయపడుతోందా?.. అంటూ ప్రశ్నిస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. ఒకవేళ మనం బట్టల గురించే చర్చించాల్సి వస్తే మోదీ ధరించిన సూటు, కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుకుందామని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైందనే చెప్పాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం