మాజీ కేంద్రమంత్రి కెప్టెన్​ సతీశ్​ శర్మ అంత్యక్రియల్లో రాహుల్​ గాంధీ.. పాడె మోసిన కాంగ్రెస్ నేత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత కెప్టెన్ సతీశ్ శర్మ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న శర్మ..

మాజీ కేంద్రమంత్రి కెప్టెన్​ సతీశ్​ శర్మ అంత్యక్రియల్లో రాహుల్​ గాంధీ.. పాడె మోసిన కాంగ్రెస్ నేత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత కెప్టెన్ సతీశ్ శర్మ ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న శర్మ.. గోవాలో బుధవారం కన్నుముశారు. ఈ నేత అంత్యక్రియలకు రాహుల్​ గాంధీ హాజరయ్యారు. స్వయంగా సతీశ్​ శర్మ పార్థివదేహాన్ని భుజంపై మోశారు.  గాంధీ కుటుంబానికి సతీశ్ వీరవిధేయుడుగా పేరున్న విషయం తెలిసిందే.

1947 అక్టోబరు 11న తెలంగాణలోని సికింద్రాబాద్​లో జన్మించిన సతీశ్​ శర్మ.. మాజీ ప్రధాని రాజీవ్​గాంధీతో అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 1993 నుంచి 1996 వరకు  పీవీ నరసింహారావు ప్రభుత్వంలో పెట్రోలియం, సహాజ వాయువుల ఉత్పత్తి మంత్రిత్వ శాఖను చేపట్టారు. అమేథీ, కాంగ్రెస్ కంచుకోట రాయ్​బరేలీల నుంచి 3సార్లు లోక్​సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

Also Read:

 వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సంస్థ సరికొత్త ప్రచారం.. కొత్త డెడ్‌లైన్ ఇదే..!

ఈసారి ఐపీఎల్‌లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్‌కే..’ల్యాండ్ ఆఫ్ బాహుబలి’ అంటూ

Click on your DTH Provider to Add TV9 Telugu