LK Advani: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్రం.. స్పందించిన కాంగ్రెస్

బీజేపీ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా స్పందించారు. ఎల్‌కే అద్వానీకి అభినందనలు తెలిపిన ఆమె, త్వరలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కూడా భారతరత్న ఇస్తారేమోనన్నారు.

LK Advani: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్రం.. స్పందించిన కాంగ్రెస్
Alka Lamba On Advani Bharat Ratna

Updated on: Feb 03, 2024 | 1:19 PM

బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా స్పందించారు. ఎల్‌కే అద్వానీకి అభినందనలు తెలిపిన ఆమె, త్వరలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కూడా భారతరత్న ఇస్తారేమోనన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ లబ్ధి కోసం ప్రతిదీ చేస్తారని ఎద్దేవా చేశారు.

ఎల్‌కే అద్వానీకి ప్రభుత్వ గౌరవం దక్కిందని, అయితే పదేళ్లలో అసలు గౌరవం దక్కలేదని కాంగ్రెస్ నేత ఉదిత్ రాత్ అన్నారు. ప్రతి కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆయనను విస్మరిస్తూనే ఉన్నారన్నారు ఆయనను కనీసం రాష్ట్రపతిగా కూడా చేయలేదన్నారు. ఏదైతేనేం చివరికి భారతరత్నతో సత్కరించడం సంతోషమన్నారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించనున్నట్లు ఫిబ్రవరి 3న ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఇలా రాశారు, “అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకులలో ఒకరైన అద్వానీ భారతదేశ అభివృద్ధికి గొప్ప కృషి చేశారు. అట్టడుగు స్థాయిలో పని చేస్తూ జీవితాన్ని ప్రారంభించిన ఆయన మన ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారు”. అంటూ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ల పదవీకాలం ముగియనుంది. ఇప్పటివరకు 7 మంది వ్యక్తులకు వారి విశిష్ట సేవలకు భారతరత్న అవార్డును ప్రదానం చేసింది మోదీ సర్కార్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో ప్రారంభించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు.

మోడీ ప్రభుత్వంచే భారతరత్న అవార్డు పొందిన ఏడుగురు వ్యక్తులలో ముగ్గురు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. వారిలో అటల్ బిహారీ వాజ్‌పేయి, నానాజీ దేశ్‌ముఖ్, లాల్ కృష్ణ అద్వానీలు ఉన్నారు. అదే సమయంలో, దేశ మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కూడా ఈ గౌరవం లభించింది. సోషలిస్టు నేతగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారతరత్న ప్రకటించింది.

ఇది కాకుండా, సంగీత రంగంలో చేసిన కృషికి గాను నరేంద్ర మోదీ ప్రభుత్వం భూపేన్ హజారికాకు భారతరత్న ఇచ్చింది. అదే సమయంలో, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య స్వాతంత్ర్య ఉద్యమంలో సాటిలేని కృషి చేశారు. అంతేకాదు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు కూడా ఈ గౌరవం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించిన ఏడుగురిలో నలుగురికి మరణానంతరం ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us