Supriya Shrinate: కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అభ్యర్థుల జాబితా నుంచి సుప్రియా శ్రీనాట్‌ను తొలగించిన కాంగ్రెస్

|

Mar 28, 2024 | 12:01 PM

బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనెట్‌ టికెట్‌ రద్దయింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి వీరేంద్ర చౌదరికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియ ఇక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరి చేతిలో ఓడిపోయారు. టిక్కెట్‌ రద్దు చేయడానికి అభ్యంతరకరమైన వ్యాఖ్యలే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Supriya Shrinate: కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అభ్యర్థుల జాబితా నుంచి సుప్రియా శ్రీనాట్‌ను తొలగించిన కాంగ్రెస్
Supriya Shrinate On Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనెట్‌ టికెట్‌ రద్దయింది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి వీరేంద్ర చౌదరికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియ ఇక్కడి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరి చేతిలో ఓడిపోయారు. టిక్కెట్‌ రద్దు చేయడానికి అభ్యంతరకరమైన వ్యాఖ్యలే కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రియ దానిని ఖండించారు.

టికెట్ నిరాకరించిన తర్వాత, సుప్రియ మాట్లాడుతూ , తాను సోషల్ మీడియా చీఫ్‌గా దృష్టి పెట్టాలనుకుంటున్నానని, అందుకే తనను ఎన్నికల్లో పోటీ చేయవద్దని పార్టీని కోరానని చెప్పారు. తన స్థానంలో అభ్యర్థి పేరును కూడా ఆమె పార్టీకి సూచించారు. మధ్యప్రదేశ్ , ఉత్తరప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్‌లకు చెందిన 14 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన ఎనిమిదో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. అయితే అనుహ్యంగా గురువారం రోజు సుప్రియాకు టికెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి సినీ నటి కంగనా రనౌత్‌ను అభ్యర్థిగా చేసిన తర్వాత , సుప్రియా శ్రీనెట్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ వివాదానికి దారితీసింది. దీనిపై సుప్రియ మాట్లాడుతూ.. తాను అలా పోస్ట్ చేయలేదని, తొలగించానని సర్ధి చెప్పారు. తాను ఏ మహిళపైనా వ్యక్తిగత, అసభ్యకర వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు.

ఇక డిలీట్ చేసిన పోస్ట్ తనను బాధించిందని కంగనా రనౌత్ తెలిపారు. ” తి మహిళ గౌరవానికి అర్హమైనది, ఆమె ఏ వృత్తిలో ఉన్నా గౌరవించాలి. ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది.” అని కంగనా అన్నారు. సోషల్ మీడియా X ప్లాట్‌ఫారమ్‌లో సుప్రియా ష్రినేట్‌ని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు కంగనా. “ప్రియమైన సుప్రియా జీ, ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌లో గత 20 సంవత్సరాలలో, అన్ని రకాల మహిళా పాత్రలను పోషించాను. క్వీన్‌లో ఒక అమాయక అమ్మాయి నుండి ఢాకడ్‌లోని సమ్మోహన గూఢచారి వరకు. మణికర్ణికలో ఒక దేవత చంద్రముఖిలోని రాక్షసుడికి, రజ్జోలో ఒక వేశ్య నుండి తలైవిలో విప్లవ నాయకురాలి వరకు”. అన్ని పాత్రల్లో నటించానని కంగనా రనౌత్ గుర్తు చేశారు.

ఇక సుప్రియా శ్రీనాట్ వ్యాఖ్యలను బీజేపీ నేతలతో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులు సైతం తప్పుబట్టారు. మరోవైపు ఎన్నికల సంఘం సుప్రియ శ్రీనతేకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్య మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని పోల్ ప్యానెల్ పేర్కొంది. షోకాజ్ నోటీసులపై మార్చి 29 సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని ఈసీ కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…