Coronavirus Lockdown: తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ జిల్లాలో కఠిన లాక్‌డౌన్.. ప్రజా రవాణా బంద్..

Corona Lockdown: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో..

Coronavirus Lockdown: తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ జిల్లాలో కఠిన లాక్‌డౌన్.. ప్రజా రవాణా బంద్..
Night Curfew in Telangana

Updated on: Mar 25, 2021 | 8:31 AM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో.. అధికారులు ఆయా ప్రాంతాల్లో లా‌క్‌డౌన్‌ను అమలు చేశాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణకు అనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.

అక్కడ నైట్ కర్ఫ్యూ విధించినా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదల లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. ప్రజా రవాణా అంతా బంద్ కానుండగా.. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కిరాణా, పాలు, కూరగాయల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు.

మరోవైపు బీడ్ జిల్లాలోనూ రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులోకి రానుంది. కరోనా కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని బీడ్ కలెక్టర్ వెల్లడించారు.

నాందేడ్‌లో లాక్‌డౌన్.. తెలంగాణపై ప్రభావం.!

నాందేడ్‌లో లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణపై పడింది. అక్కడ రవాణా వ్యవస్థపై కఠిన ఆంక్షలు విధించడంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై ఈ ప్రభావం పడింది. అక్కడ ప్రజా రవాణా పూర్తిగా బంద్ అయింది. ప్రైవేట్ వాహనాలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు.

Also Read:

కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Follow Us