Lockdown News: ఆ రాష్ట్రంలో మళ్ళీ విజృంభించిన కోవిడ్ కేసులు… ఈ వీకెండ్‌లో పూర్తిస్థాయి లాక్ డౌన్..

ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఈ కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం ఒక్క రోజే 22,056 కొత్త కేసులు నమోదు కాగా 156 మంది కోవిడ్ రోగులు మరణించారు. ఇన్ఫెక్షన్ కేస్ లోడ్ 33,27,301 కి పెరిగినట్టు..

Lockdown News: ఆ రాష్ట్రంలో మళ్ళీ విజృంభించిన కోవిడ్ కేసులు... ఈ వీకెండ్‌లో పూర్తిస్థాయి లాక్ డౌన్..
Representative Image

Edited By:

Updated on: Jul 29, 2021 | 11:15 AM

Kerala Lockdown: కేరళలో కోవిడ్ కేసులు మళ్ళీ విజృంభిస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ఈ కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం ఒక్క రోజే 22,056 కొత్త కేసులు నమోదు కాగా 156 మంది కోవిడ్ రోగులు మరణించారు. ఇన్ఫెక్షన్ కేస్ లోడ్ 33,27,301 కి పెరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 31, ఆగస్టు 1 తేదీలలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు, కోవిడ్ మేనేజ్ మెంట్ లో ప్రభుత్వానికి సహకరించేందుకు ఆరుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా శీఘ్రంగా కేరళలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా దీని సీరో పాజిటివిటీ చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా రెండు రోజుల్లో ఇండియాలో నమోదైన సుమారు 40 శాతం కోవిడ్ కేసుల్లో ఇతర రాష్ట్రాల కన్నా ఈ రాష్ట్రంలో నమోదైన కేసులే అధికంగా ఉన్నాయి.

ఈ నెల 21 న బక్రీద్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆంక్షలను ఎత్తివేయాలని సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇలా కేసులు పెరిగిపోవడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఆంక్షల ఎత్తివేతను అమలు కాకుండా చూడాలని కోరుతూ ఓ అడ్వొకేట్ గతవారం కోర్టుకు కూడా ఎక్కారు. అయితే ప్రభుత్వం తరఫు న్యాయవాది.. రాష్ట్రంలో పలు చోట్ల షాపులు మూసే ఉన్నాయని, ప్రజలు కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని కోర్టుకు తెలిపారు. పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని ఇక్కడ చూడండి : ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.

 చిరు వ్యాపారులకు అండగా సోను..రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో ప్రత్యక్షమైన రియల్ హీరో..:Real Hero Sonu Sood Video.

 లేపాక్షి బసవన్న రంకె వేసే టైమొచ్చింది..లేపాక్షికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు.: Lepakshi Live Video.

 టాకీస్‌ టాపిక్‌పై నాని క్లాస్‌.. హాట్ టాపిక్ గా మారిన న్యాచురల్ స్టార్ కామెంట్స్..:Nani Comments on Theaters video.