Mamata On Ganguly: ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌరవ్ గంగూలీని అనుమతించండి.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి

సౌరవ్ గంగూలీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతుగా నిలిచారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేసేందుకు గంగూలీ సిద్ధమవుతున్న సమయంలో మమతా వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Mamata On Ganguly: ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌరవ్ గంగూలీని అనుమతించండి..  ప్రధాని మోదీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
Mamata Banerjee On Sourav Ganguly

Updated on: Oct 17, 2022 | 6:32 PM

సౌరవ్ గంగూలీ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సౌరవ్ గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించాల్సిందిగా నేను ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. పాపులర్ పర్సన్ కాబట్టి తిరస్కరిస్తున్నారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవద్దని, క్రికెట్, క్రీడలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని మమతా బెనర్జీ అన్నారు. ఆయన రాజకీయ పార్టీ సభ్యుడు కాదు.. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని భర్తీ చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. తనను ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)కి పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

మమతా బెనర్జీ ఏం చెప్పారు?

సౌరవ్ గంగూలీని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి. గంగూలీని తొలిగించడం తనకు చాలా బాధగా ఉందని సీఎం అన్నారు. సౌరవ్ చాలా పాపులర్ పర్సనాలిటీ.. అతను భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. ఆయన దేశం కోసం చాలా చేశారు. ఆయన బెంగాల్‌కే కాదు, భారతదేశానికే గర్వకారణం. ఈ విధంగా వారిని మినహాయించడం సరికాదన్నారు.

సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ రానున్నాడు..

మీడియా నివేదికల ప్రకారం, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బోర్డు అధిపతిగా కొనసాగాలని కోరుకున్నాడు, అయితే ఇతర సభ్యుల నుండి మద్దతు లభించలేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. సౌరవ్ గంగూలీ 2019లో బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. అక్టోబర్ 18న ఆయన తన పదవి నుంచి వైదొలగనున్నారు.

CAB ఎన్నికల్లో గంగూలీ పోటీ చేయనున్నారు

బీసీసీఐ అధ్యక్ష పదవిని వదులుకున్న తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని సౌరవ్ గంగూలీ తెలిపాడు. మరోవైపు ఐసీసీ చైర్మన్‌ ఎన్నిక కూడా జరుగుతోంది. అక్టోబర్ 20న ఐసీసీ చైర్మన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన గంగూలీ ఐసీసీ చైర్మన్‌ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చర్చ జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..