దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI Airport)లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు సౌదీ నుంచి వచ్చిన మొహ్మద్ అష్రఫ్ అనే ప్రయాణీకుడిని అనుమానించి తనిఖీ చేశారు. బ్యాగు కింది భాగంలో దాచి అక్రమంగా తరలిస్తున్న 1.20 లక్షల సౌదీ రియాల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ కరెన్సీ విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన విదేశీ కరెన్సీ..
Vigilant #CISF personnel apprehended a passenger namely Mohammad Ashraf carrying foreign currency ( 1.2 lakh Saudi Riyals worth approximately INR 24 lakh ) concealed in false bottom of his bag @ IGI Airport, New Delhi. The Passenger was handed over to customs. pic.twitter.com/vUwrn1NDMU
— CISF (@CISFHQrs) November 9, 2021
The Central Industrial Security Force (CISF) detects 1.2 lakh Saudi Riyals worth Rs 24 lakhs from a passenger at Delhi’s Indira Gandhi International (IGI) airport. pic.twitter.com/NzKj4Kn5K6
— ANI (@ANI) November 9, 2021
Also Read..
Jai Bhim: మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జై భీమ్ సినిమా.. ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా..