వాళ్ళ అసలు సంగతి తెలిసింది.. చైనాపై ట్రంప్ ఫైర్

ఇండియాపైన, ఇతర దేశాలపైనా చైనా దూకుడు వైఖరి.. ఆదేశ కమ్యూనిస్ట్ పార్టీ నేతల అసలైన 'రంగు' ను బయటపెట్టిందని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లదాఖ్ ప్రాంతంలో చైనా దురాక్రమణను చూస్తే ఇది నిర్ధారణ..

వాళ్ళ అసలు సంగతి తెలిసింది.. చైనాపై ట్రంప్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 12:13 PM

ఇండియాపైన, ఇతర దేశాలపైనా చైనా దూకుడు వైఖరి.. ఆదేశ కమ్యూనిస్ట్ పార్టీ నేతల అసలైన ‘రంగు’ ను బయటపెట్టిందని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లదాఖ్ ప్రాంతంలో చైనా దురాక్రమణను చూస్తే ఇది నిర్ధారణ అయినట్టే ఉందన్నారు. ఆ ప్రాంతంలో భారత-చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితిని అమెరికా జాగ్రత్తగా గమనిస్తోందని, శాంతియుత పరిష్కారాన్ని కోరుతోందని ఆయన వ్యాఖ్యానించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్  ఎనే తెలిపారు. చైనా దురాక్రమణ తీరు అక్కడికి పాలక పార్టీ వైఖరిని  ప్రతిబింబిస్తోందని ట్రంప్ పేర్కొన్నట్టు ఆమె వెల్లడించారు. చైనా అధ్యక్ధుడు  జీ జిన్ పింగ్, ప్రధాని మోదీ ఇద్దరు గత ఏడాది అక్టోబరులో సమావేశమైనప్పుడు భారత-చైనా సహకారం గురించి ప్రస్తావించారని బ్రూకింగ్స్ ఇన్స్ టి ట్యూట్ సీనియర్ ఫెలో తన్వి మదన్ అన్నారు. హౌస్ సెలెక్ట్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. గత మే నెల నుంచి చైనా దళాలు ఏకపక్షంగా నియంత్రణ రేఖ పొడవునా యధాతథ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. చైనా చర్యలతో బాటు కరోనా వైరస్ కూడా ఇండియా పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆమె చెప్పారు. బీజింగ్ తో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవాలని ఇండియాలో దాదాపు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింగని మదన్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం కోరితే ఈ విషయంలో ఏం చేయాలన్నది అమెరికా నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు. దీన్ని బట్టి చూస్తే భారత-చైనా సమస్యపై అమెరికాలో పెద్ద చర్చే జరిగినట్టు కనబడుతోంది.