కన్నబిడ్డలా ఆదరించారు.. కుప్పంలో చంద్రబాబు భావోద్వేగం

| Edited By:

Jul 02, 2019 | 4:24 PM

కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. ఆయన ఇవాళ తన సొంత జిల్లా అయిన చిత్తూరులో పర్యటించారు. ఏపీ – కర్నాటక సరిహద్దుల్లోని రామకుప్పంలో అడుగుపెట్టిన ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజుపేట క్రాస్ రోడ్డు దగ్గర పార్టీ అభిమానులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచారానికి రాకపోయినా ఏడు సార్లు తనను గెలిపించారని.. నియోజకవర్గ […]

కన్నబిడ్డలా ఆదరించారు.. కుప్పంలో చంద్రబాబు భావోద్వేగం
Follow us on

కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వచ్చారు. ఆయన ఇవాళ తన సొంత జిల్లా అయిన చిత్తూరులో పర్యటించారు. ఏపీ – కర్నాటక సరిహద్దుల్లోని రామకుప్పంలో అడుగుపెట్టిన ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాజుపేట క్రాస్ రోడ్డు దగ్గర పార్టీ అభిమానులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రచారానికి రాకపోయినా ఏడు సార్లు తనను గెలిపించారని.. నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

1989 తర్వాత కుప్పంలో తనకు తక్కువ మెజార్టీ వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 40 రోజులు గడిచినా ఓటమి పట్ల కార్యకర్తలు ఇంకా బాధపడుతున్నారని తెలిపారు. ఓటమి కారణాలపై విశ్లేషిస్తున్నామని.. తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. పార్టీని కాపాడుకోడానికి శాయశక్తులా పనిచేస్తానని.. కార్యకర్తలపై దాడులు జరగడం బాధాకరమన్నారు. ఇప్పటికే ఆరుగురు కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని… కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నా భుజస్కంధాలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని.. దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడే వారు కాదంటూ.. పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి అన్నారు.