
Scrap Earns: 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛతా డ్రైవ్ ప్రారంభమైంది. ఆ డ్రైవ్ ద్వారా భారతదేశం పరిశుభ్రంగా మారడమే కాకుండా, ప్రభుత్వం ఆదాయాన్ని కూడా సంపాదిస్తోంది. గత నెలలో జరిగిన భారీ శుభ్రపరిచే డ్రైవ్‌లో స్క్రాప్‌ను అమ్మడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. దాదాపు రూ.800 కోట్ల వరకు సంపాదించింది. ఇది రూ. 615 కోట్ల వ్యయంతో చంద్రునిపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 బడ్జెట్‌ను గణనీయంగా మించిపోయింది.
2021లో వార్షిక ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి ఈ సంవత్సరం గణాంకాలు స్క్రాప్ అమ్మకం ద్వారా ప్రభుత్వ మొత్తం ఆదాయాన్ని దాదాపు రూ.4,100 కోట్లకు తీసుకువచ్చాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 2 – 31 మధ్య జరిగిన ప్రచారంలో ఇప్పటివరకు గరిష్టంగా 232 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాల్లో ఉన్న స్క్రాప్ ఖాళీ చేసినట్లు, అత్యధికంగా 29 లక్షల భౌతిక ఫైళ్లను తొలగించారు. దాదాపు 11.58 లక్షల కార్యాలయ స్థలాలను కవర్ చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold Price: దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DAR&PG) ఆధ్వర్యంలో విదేశాలలోని మిషన్లు సహా 84 మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ప్రభావవంతమైన అంతర్-మంత్రిత్వ సమన్వయం సాధించింది. ముగ్గురు సీనియర్ మంత్రులు, మన్సుఖ్ మాండవీయ, కె రామ్ మోహన్ నాయుడు, డాక్టర్ జితేంద్ర సింగ్ మొత్తం కసరత్తును పర్యవేక్షించారు.
2021- 2025 మధ్య కేంద్రం ఐదు విజయవంతమైన ప్రత్యేక ప్రచారాలను నిర్వహించింది. ఇవి స్వచ్ఛత (పరిశుభ్రత)ను మెరుగు పర్చేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఐదు ప్రచారాలలో సాధించిన సంచిత పురోగతిలో ‘స్వచ్ఛత’ ప్రచారం కింద 23.62 లక్షల కార్యాలయాలను కవర్ చేయడం, 928.84 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయడం, 166.95 లక్షల ఫైళ్లను తొలగించడం లేదా మూసివేయడం, స్క్రాప్ అమ్మకం ద్వారా రూ.4,097.24 కోట్లు సంపాదించింది. ఈ సంవత్సరం, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు ఈ ప్రచారాన్ని సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రత్యేక ప్రచారం కింద మంత్రిత్వ శాఖలు పనిచేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 10, 11న పాఠశాలలకు సెలవు!
ఇది కూడా చదవండి: Money Saving Tips: నెల చివరలో డబ్బులతో సతమతమవుతున్నారా? ఇలా చేస్తే డబ్బుకు లోటుండదు!