కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ పరీక్షలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన హై-లెవెల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్ధి విచిత్రమైన కోరికను కోరాడు. అతడు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
12వ తరగతి ముగించుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్లే తమకు ఫేర్‌వెల్ పార్టీ లేదని తలచి.. తలంపు వచ్చినదే తడవుగా కుకీ అగర్వాల్ అనే విద్యార్ధి ప్రధానికి ట్వీట్ పెట్టాడు. ‘సార్.. ఫేర్‌వెల్ అయినా చేసుకోనివ్వండి. ఆ 12వ తరగతి బి-సెక్షన్ నేహాను చీరలో చూడాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్, మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు.
Government of India has decided to cancel the Class XII CBSE Board Exams. After extensive consultations, we have taken a decision that is student-friendly, one that safeguards the health as well as future of our youth. https://t.co/vzl6ahY1O2
— Narendra Modi (@narendramodi) June 1, 2021
Sir farewell to kraa do….wo 12th B wali neha ko साड़ी me dekhna tha.
— Kuki Aggarwal (@kukiaggarwal) June 1, 2021
Bhai pure Instagram mai tere tweet ke memes ban rahe hai?
— Manjunath Patil???? (@manjunath_3155) June 1, 2021