Cast Issues: దారుణాతి దారుణం.. మొన్న బాత్‌రూమ్‌లు కడిగించారు.. నిన్న రంగులతో వేరు చేశారు..!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయుల పనితీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా తమిళనాడులో మరో కుల వివక్ష ఘటన బయటపడింది.

Cast Issues: దారుణాతి దారుణం.. మొన్న బాత్‌రూమ్‌లు కడిగించారు.. నిన్న రంగులతో వేరు చేశారు..!
Caste

Updated on: Dec 23, 2021 | 9:13 AM

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో కొందరు ఉపాధ్యాయుల పనితీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా తమిళనాడులో మరో కుల వివక్ష ఘటన బయటపడింది. మొన్న తిరుప్పూర్, నిన్న సేలంలో ప్రభుత్వ పాఠశాలలో కుల వివక్ష ఘటనలు బయటపడ్డాయి. సేలం జిల్లా ఆత్తూర్‌లోని ప్రభుత్వపాఠశాలలో విద్యార్థుల అటెండెన్స్‌లో కులం ప్రస్తావన చర్చనీయాంశమైంది. ప్రతి విద్యార్థిని పేరు చివరన కులం ప్రస్తావిస్తూ రిజిష్టర్‌లో నమోదు చేశారు. ఎస్సీ అయితే ఎరుపు రంగు, బీసీ ఐతే బ్లూ రంగు, ఎంబీసీ ఐతే బ్లాక్ రంగులతో వివరాలు నమోదు చేశారు ఉపాధ్యాయులు. దీనిపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్‌లో జరిగిన ఘటనఫై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇదిలా ఉంటే, ఇటీవల తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్న గీత, కొన్ని రోజులుగా పిల్లలతో స్కూల్‌లో బాత్‌రూంలు శుభ్రం చేయించింది. అనుమానం రావడంతో అరా తీశారు తల్లితండ్రులు.

దళితులు చదువుకోవడానికి పనికిరారు అని, మీకు చదువు ఎందుకని, మీరు తక్కువ జాతి వారని ప్రిన్సిపాల్ గీత తిట్టేవారని విద్యార్థులు తల్లితండ్రులకు చెప్పారు. దీంతో అసలు విషయం బయటపడింది. గీతపై అధికారులకు ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. అప్రమత్తమైన అధికారులు, పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేపట్టారు. అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపాల్ గీత, స్కూల్ పిల్లలను కులం పేరుతో దూషించి, వారిని హింసించేవారని విచారణలో వెల్లడైంది. మీ జాతి ఇంతే, మీకు తల్లిదండ్రులు లేరని, మీరు చదువుకొని ఏం చేస్తారని తక్కువ చేసి మాట్లాడేవారని, తమ చేతే మగవాళ్ల బాత్రూమ్ లను కడిగించేవారని కన్నీరు పెట్టుకున్నారు విద్యార్థినులు. దీంతో గీతను విధుల నుంచి తొలగించారు అధికారులు. ఈ ఘటనఫై పూర్తి విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also read:

Natural star Nani: నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు.. నాని ఆసక్తికర కామెంట్స్

Health Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం పొందండిలా..!

Watch Video: స్క్రాప్‌తో వెరైటీ వెహికిల్.. ముగ్ధుడైన ఆనంద్ మహేంద్ర.. ఏం గిఫ్టిచ్చాడో తెలుసా?