పౌరసత్వ బిల్లు సెగతో.. రణరంగంగా మారిన ఢిల్లీ

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా.. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో నాలుగు బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. మధుర రోడ్డులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మంటలను ఆర్పడానికి వచ్చిన నాలుగు ఫైరింజన్‌లను కూడా ధ్వంసం చేశారు ఆందోళన కారులు. కాగా.. పెద్ద సంఖ్యలో యూనివర్శిటీ విద్యార్థులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని […]

పౌరసత్వ బిల్లు సెగతో.. రణరంగంగా మారిన ఢిల్లీ

Edited By:

Updated on: Feb 16, 2020 | 2:03 PM

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా.. ఆందోళన కారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో నాలుగు బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. మధుర రోడ్డులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మంటలను ఆర్పడానికి వచ్చిన నాలుగు ఫైరింజన్‌లను కూడా ధ్వంసం చేశారు ఆందోళన కారులు. కాగా.. పెద్ద సంఖ్యలో యూనివర్శిటీ విద్యార్థులు.. పోలీసులతో ఘర్షణకు దిగారు. వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేసి, బాష్పయువును ప్రయోగించారు. అలాగే ఇప్పటికే యూనివర్శిటీలో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.

అస్సాంలో పరిస్థితి కొద్దికొద్దిగా తేరుకుంటున్నప్పటికీ.. దక్షిణ ఢిల్లీని సెగ తాకడం విశేషం. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హింసను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. నిరసన కారులు శాంతియుతంగా ప్రదర్శన చేయాలని, ఆందోళనలకు పూనుకోరాదని ఆయన కోరారు.