Budget 2026: గుడ్‌న్యూస్.. ఏపీ సహా ఆ రాష్ట్రాల్లో గనుల కారిడార్లు.. 2 హైటెక్ టెక్నాలజీ హబ్స్..

కేంద్ర వార్షిక బడ్జెట్‌-2026 ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.. తొమ్మిదోసారి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా అనంతరం.. నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ అనిశ్చతి నేపథ్యంలో.. దేశీయ ఆర్థికరంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Budget 2026: గుడ్‌న్యూస్.. ఏపీ సహా ఆ రాష్ట్రాల్లో గనుల కారిడార్లు.. 2 హైటెక్ టెక్నాలజీ హబ్స్..
Fm Nirmala Sitharaman Budget Speech

Updated on: Feb 01, 2026 | 11:52 AM

కేంద్ర వార్షిక బడ్జెట్‌-2026 ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.. తొమ్మిదోసారి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా అనంతరం.. నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ అనిశ్చతి నేపథ్యంలో.. దేశీయ ఆర్థికరంగానికి ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2026-27 ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. భారత్‌ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందని పేర్కొన్నారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్తున్నామని.. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నామని స్పష్టంచేశారు. సంస్కరణలను కొనసాగిస్తూ.. 7% వృద్ధి రేటు సాధించగలిగామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉపాధి కల్పనకు సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండటం మా కర్తవ్యం.. నిర్మాణాత్మక సంస్కరణలు, పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

2 హైటెక్ టెక్నాలజీ హబ్స్ ..

బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం..ప్రస్తుతమున్న NIPERs ఆధునీకరణ.. దేశంలో 2 హైటెక్ టెక్నాలజీ హబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు.. దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారు. జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూత.. దేశవ్యాప్తంగా మెగా టెక్స్‌టైల్ పార్క్‌ ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.


ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు, SME రంగానికి రూ.10 వేల కోట్లు, మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించున్నట్లు తెలిపారు.