బడ్జెట్-2021, వంటనూనెలపై రూ. 19 వేలకోట్ల ‘నేషనల్ మిషన్’, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన

| Edited By: Ram Naramaneni

Jan 31, 2021 | 7:10 PM

రానున్న బడ్జెట్ లో వంటనూనెలపై రూ. 19 వేల కోట్ల నేషనల్ మిషన్ (జాతీయ కార్యాచరణ) ప్రతిపాదనను వ్యవసాయ మంతిత్వ శాఖ సిధ్ధం చేసింది..

బడ్జెట్-2021, వంటనూనెలపై రూ. 19 వేలకోట్ల నేషనల్ మిషన్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన
Economic Survey 2020-21
Follow us on

Budget 2021: రానున్న బడ్జెట్ లో వంటనూనెలపై రూ. 19 వేల కోట్ల నేషనల్ మిషన్ (జాతీయ కార్యాచరణ) ప్రతిపాదనను వ్యవసాయ మంతిత్వ శాఖ సిధ్ధం చేసింది. బడ్జెట్ ఆమోదానికి దీన్ని నివేదించనున్నారు. ఈ మిషన్ కింద వంటనూనెల ఉత్పత్తిలో స్వావలంబన సాధించేందుకు అయిదేళ్ళ ప్రపోజల్ ని తాము సిధ్ధం చేశామని ఈ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం విదేశాల నుంచి ఎడిబుల్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నందున ప్రభుత్వ ఖజానాకు ఏటా 75 వేలకోట్ల వ్యయమవుతోందని, తమ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే బడ్జెట్ లో ఈ వ్యయం తగ్గడమే కాక, దేశంలో లోకల్ గా ఉత్పత్తి చేసే వంటనూనెల ధరలు కూడా తగ్గుతాయని ఆయన వివరించారు. ఇప్పుడు దేశం 1.5 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంటోంది. ఇది మనకు సాలీనా అవసరమయ్యే 23 మిలియన్ టన్నుల్లో 70 శాతం వరకు ఉంటుందని ఆయన అన్నారు. వచ్ఛే ఐదేళ్లలో వంట నూనెల దిగు,మతులను పూర్తిగా తగ్గించాలన్నది లక్ష్యమన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది బడ్జెట్ ను సమర్పించినప్పుడు వంట నూనెల ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించేలా చూడాలని రైతులను కోరినప్పటికీ ఇందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు.

కాగా వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన మిషన్ కింద వంటనూనెల దిగుమతులపై టన్నుకు  రూ. 2,500 నుంచి మూడు వేల వరకు సెస్ ను విధించాలని అంటున్నారు. దీనివల్ల సాలుకు 6 వేలకోట్ల కార్పస్ నిధులను సమీకరించవచ్ఛునని భావిస్తున్నారు.

ఇలా ఉండగా రానున్న ఆర్ధిక సంవత్సరంలో నాలుగేళ్లలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వం  రెట్టింపు నిధులను కేటాయించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. హెల్త్ కేర్ పై 1.2 లక్షల నుంచి 1.3 లక్షల వరకు నిధులను పెంచవచ్చు. ప్రస్తుతం ఇది 62,600 కోట్లు ఉంది.