Viral video: పెళ్లికి వేళయరా..! ట్రాఫిక్‌లో ఇరుక్కులేక ఓ పెళ్లికూతురు ఏం చేసిందంటే..

|

Jan 18, 2023 | 9:59 PM

వధూవరులు విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురు మెట్రోరైల్లో హల్‌చల్‌ చేసింది.

Viral video: పెళ్లికి వేళయరా..! ట్రాఫిక్‌లో ఇరుక్కులేక ఓ పెళ్లికూతురు ఏం చేసిందంటే..
Bengaluru Traffic
Follow us on

ప్రస్తుతమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో పెళ్ళి, బరాత్‌,రిసెప్షన్‌, వధూవరుల డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలు అనేకం నెట్టిజన్లను అలరిస్తుంటాయి. వధూవరులు విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురు మెట్రోరైల్లో హల్‌చల్‌ చేసింది. పెళ్లి సమయం దగ్గరపడుతుండగా, వధువు పెళ్లి మండపానికి కారులో బయల్దేరింది. కానీ, పెళ్లి వేదికకు చేరుకునే ప్రయత్నంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో..ఓ సూపర్‌ ఐడియా తట్టింది. దీంతో వెంటనే ఆమె పెళ్లి కూతురు గెటప్‌లోనే మెట్రో రైలులో ఎక్కి పెళ్లి మండపానికి చేరుకుంది నవ వధువు. బెంగళూరులో చోటు చేసుకుంది ఈ విచిత్ర సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు రోడ్లపై ట్రాఫిక్‌ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి రోడ్డులో ఓ వధువు భారీ ట్రాఫిక్ మధ్య తన పెళ్లి మండపానికి బయల్దేరింది. హేవీ ట్రాఫిక్‌ కారణంగా మండపానికి సమయానికి చేరుకోలేనని తెలుసుకుంది..దీంతో ఆమె తన కారును అక్కడే పార్క్ చేసి మెట్రోలో వెళ్లింది. ఒంటినిండా ఆభరణాలు ధరించి, పూర్తి మేకప్‌తో మెట్రో ఎక్కెసింది. తోడుగా తమ బంధువులు కూడా ఉన్నారు. మెట్రో స్టేషన్‌లో నవవధువు చిరునవ్వుతో సందడి చేసింది. పెళ్లి కూతురు గెటప్‌తో మెట్రో రైడ్ చేస్తున్న వధువును చూసిన తోటి ప్రయాణికులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ బ్రైడ్‌ వీడియో సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వార్త రాసే సమయానికి వీడియో 3000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..