Goa Covid-19 Rules: గోవా టూర్‌ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఇవి తప్పనిసరి.. గోవా సర్కార్‌ కొత్త రూల్స్‌

|

Jun 25, 2021 | 1:48 PM

Goa Covid-19 Rules: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పర్యటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో.

Goa Covid-19 Rules: గోవా టూర్‌ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఇవి తప్పనిసరి.. గోవా సర్కార్‌ కొత్త రూల్స్‌
Goa Beach (Representative Image)
Follow us on

Goa Covid-19 Rules: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పర్యటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే పర్యటక స్థలాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గోవా టూర్‌ వెళ్లే వారికి కొత్త నిబంధనలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుని ఉండాలని, దీంతో పాటు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్ రిపోర్టు నెగిటివ్‌తో రావాలని మంత్రి మైఖెల్‌ లోబో తెలిపారు.

జూలై వరకూ వెయిట్‌ చేసి కేసుల సంఖ్య జీరో అయ్యాకే ప్రోపర్ స్క్రీనింగ్ వాడి రీ ఓపెన్ చేస్తామని చెబుతున్నారు. కోవిడ్‌ టీకాలు రెండు డోసులు, నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అయితే కరోనా పరిస్థితి సద్దుమణిగే వరకు వేచి చూడాలని, ఒక నెల పాటు తగ్గుతూ ఉంటే బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఈ నిబంధనలు న్యూ ఇయర్, క్రిష్టమస్ వరకూ కంటిన్యూ చేస్తామని చెప్పడం లేదని అన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి ప్రొటోకాల్స్ కు మార్పులు చేసి టూరిస్టులకు ఇబ్బంది లేకుండా చేస్తామని లోబో పేర్కొన్నారు. ఇంతలోనే కోవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ పొరుగు రాష్ట్రాలు కేసులను నివేదించిన నేపథ్యంలో గోవా ప్రభుత్వం మహారాష్ట్ర పక్కనే ఉన్న సరిహద్దులో నిఘా పెంచింది. ఇది చాలా అంటు వ్యాధిగా పరిగణించబడుతుందని తెలిపింది. గోవాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను గుర్తించినందున సరిహద్దు వెంబడి నిఘా వేగవంతం చేశామని, డెల్టా వేరియంట్‌ కేసుల్లో 21 ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే తెలిపారు. కాగా, గురువారం గోవాలో 229 కొత్త కొవిడ్-19కేసులు నమోదు కాగా, 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 9 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2వేల 727యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి

Spicejet Offer: విమాన ప్రయాణికులకు శుభవార్త.. స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్‌ సేల్‌ ఆఫర్‌

Mukesh Amban: రూ.75 వేల కోట్లతో రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ కొత్త బిజినెస్‌.. పూర్తి వివరాలు ఇలా..!