పీఎం కేర్స్ ఫండ్ పై సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ కి చెంపదెబ్బ, బీజేపీ

| Edited By: Anil kumar poka

Aug 18, 2020 | 2:26 PM

పీఎం కేర్స్ ఫండ్  నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి బదిలీ చేయరాదని పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన సహచరులకు చెంపదెబ్బ అని బీజేపీ వ్యాఖ్యానించింది.

పీఎం కేర్స్ ఫండ్ పై సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ కి చెంపదెబ్బ, బీజేపీ
Follow us on

పీఎం కేర్స్ ఫండ్  నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి బదిలీ చేయరాదని పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన సహచరులకు చెంపదెబ్బ అని బీజేపీ వ్యాఖ్యానించింది. ఈ రూలింగ్ రాహుల్ కి, ‘రెంట్ ఎ కాజ్’ అంటూ లేనిపోని ప్రచారాలు చేస్తున్నయాక్టివిస్టులకు పెద్ద దెబ్బేనని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మీరు ఎన్ని అబద్దాలు ఆడినా సత్యమే నిలబడుతుందన్న విషయం అర్థమైందన్నారు. ఇప్పటికైనా రాహుల్, తదితరులు తమ ఆలోచనా విధానాలను సవరించుకుంటారని ఆశిస్తున్నా అన్నారు. నిజానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని గాంధీ కుటుంబం తమ సొంత నిధులుగా పరిగణించిందని, తమ కుటుంబ సభ్యుల ట్రస్టులకు  మళ్లించిందని నడ్డా ఆరోపించారు.

పీఎం కేర్స్ ఫండ్ నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి బదిలీ చేయాలంటూ ఓ ఎంజీవో దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.