వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం.. మూఢనమ్మకాలతో ప్రయోగాలు

కరోనావైరస్‌తో పోరాడటానికి కొందరు మూఢనమ్మకాలకు దగ్గరవుతున్నారు. ఎవరో ఏదో చెప్పింది విని సొంత వైద్యం చేసుకుంటూ......

వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం.. మూఢనమ్మకాలతో ప్రయోగాలు
Gau Mutra To Corona Patient

Updated on: May 01, 2021 | 5:17 PM

వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం
సోషల్ మీడియాలో వైరల్‌ అయిన పోస్ట్‌
కరోనావైరస్‌పై మూఢనమ్మకాలతో ప్రయోగాలు

కరోనావైరస్‌తో పోరాడటానికి కొందరు మూఢనమ్మకాలకు దగ్గరవుతున్నారు. ఎవరో ఏదో చెప్పింది విని సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాలమీదకుతెచ్చుకుంటున్నారు. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే ఓ బీజేపీ నేత మరో అడుగేసి దారుణంగా వ్యవహరించారు. వృధ్దురాలికి గోమూత్రం తాగించాడు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ముందుగా ఈ వీడియోను ట్విటర్‌లో సూరత్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ కిషోర్ బిందాల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు 80వేల వ్యూస్
రాగానే వెంటనే డిలీట్ చేసారు. ఆ తర్వాత మరో సోషల్ మీడియా సైట్లో పోస్ట్‌ చేసారు. కోవిడ్ బారిన పడి వెంటిలేటర్‌పై ఉంటూ శ్వాస తీసుకునేందుకు పోరాడుతోన్న ఓ వృద్ధురాలి నోట్లో ఓ బీజేపీ నేత గోమూత్రం పోశాడు. అంతేకాదు ఆమెతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే హాస్పిటల్ ఎక్విప్‌మెంట్ నుంచి ఇతర శబ్దాలు రావడంతో ఆ వృద్ధురాలితో ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో స్పష్టంగా వినిపించలేదు. ఇక కొన్ని హిందుత్వ సంస్థలు అసలు ఇంగ్లీష్ మందులతో పనే లేదంటున్నాయి. కరోనాను జయించేందుకు గోమూత్రమే పరమఔషధమని చెబుతున్నాయి. అయితే గోమూత్రం కరోనాకు లేదా క్యాన్సర్‌కు విరుగుడుగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

Also Read: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!

 బొమ్మ గన్ తో దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే ఊహించ‌ని ట్విస్ట్

 

Loading...
Unable to load recommendations.
Follow Us