Bipin Rawat – Ms Dhoni: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్న జనరల్ బిపిన్ రావత్ నిన్నహెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయిన తరువాత పదవిని చేపట్టారు రావత్. భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. చైనా, పాకిస్తాన్ దూకుడుకు కళ్లెం వేయడంతో బిపిన్ రావత్‌కు ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. రెండేళ్ల క్రితం టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఎంపికైన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి సరైన సైనిక శిక్షణ పొందేందుకు దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ అనుమతించారు. తనకు ఈ శిక్షణ ఇవ్వాలని ధోనీ కోరాడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ధోనీ అభ్యర్థనను అంగీకరించారు
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభ్యర్థనను జనరల్ బిపిన్ రావత్ అంగీకరించారు. ధోనీ పారాచూట్ రెజిమెంట్‌లోని 106వ పారా టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో రెండు నెలల పాటు శిక్షణ పొందాడు. ధోనీ శిక్షణలో ఉండగానే భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అదే సమయంలో ధోనీ శిక్షణ తీసుకున్నాడు.
జనరల్ రావత్ మాట్లాడుతూ..
శిక్షణ అనంతరం ఇతర సైనికుల మాదిరిగానే ధోనీ కూడా సైనికుడిగా పని చేస్తా ఆప్పుడు రావత్ ప్రకటించారు. సైనిక యూనిఫాం ధరించాలనుకున్న భారత పౌరుడు తనకు యూనిఫాంకు ఉన్న బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ధోనీ ప్రాదమిక శిక్షణ పొందాడని.. అతను ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తాడని తమకు తెలుసు అని జనరల్ ధోని గురించి చెప్పారు. పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన 106వ పారా టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో ధోనీ శిక్షణలో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ సమయంలో ధోనీ సాధారణ సైనికుడిలా గస్తీ, కాపలా, పోస్ట్ డ్యూటీలు నిర్వహిస్తాడు. నాడు రావత్ చేసిన ప్రకటనను నేడు ధోనీ అభిమానులు గుర్తు చేసుకున్నారు.
జనరల్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలింది
ఆర్మీకి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ అడవుల్లో బుధవారం మధ్యాహ్నం కూలిన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ సహా 13 మంది అమరులయ్యారు.
ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..