Bihar Incident: బీహార్‌లో పోలీసులు యమకింకరుల్లా తయారయ్యారు. తన కొడుకును అక్రమంగా అరెస్ట్ చేశారని , జైలులో ఉన్న కుమారుడిని విడిపించాలని వేడుకున్న మహిళతో ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ అడ్డగోలు చాకిరీ చేయించుకున్నాడు. పోలీసు స్టేషన్‌లోనే ఆ మహిళతో పోలీసు ఆఫీసర్ మసాజ్ చేయించుకున్న దృశ్యాలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. బీహార్ లోని సహర్స పోలీసు స్టేషన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. శశిభూషణ్ సిన్హా అనే పోలీసు అధికారి ఈ నిర్వాకానికి పాల్పిడినట్టు గుర్తించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. శశిభూషణ్ సిన్హాను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
మహిళతో మసాజ్ చేయించుకున్న పోలీసు అధికారి లాయర్‌తో ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోలో చొక్కా లేకుండా పోలీస్ ఆఫీసర్ ఫోన్‌లో మాట్లాడుతూ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. ఆమె పేద మహిళ అని… రూ.10 వేలు ఇస్తా.. వెంటనే ఆమె కొడుక్కి బెయిల్ ఇవ్వాలని లాయర్‌ను శశిభూషణ్ సిన్హా కోరాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
ये बिहार पुलिस है, जो फरियादी महिलाओं से थाने में तेल की मालिश कराती है.
वीडियो में सहरसा जिले के डरहार ओपी के दारोगा शशिभूषण सिन्हा बताए जा रहे हैं, वीडियो वायरल. pic.twitter.com/BAyW68Vw8R
— Utkarsh Singh (@UtkarshSingh_) April 28, 2022
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..
Also Read..
Gachibowli: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి గొంతు కోసి తోటి విద్యార్థి
Patiala Violence: పోలీసులపై కత్తులు దూసిన వేర్పాటువాదులు.. హింసాత్మకంగా మారిన ర్యాలీ..