Bihar Political Crisis: బీజేపీతో జేడీయూ తెగతెంపులు.. కీలక ప్రకటన చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్

|

Aug 09, 2022 | 3:35 PM

బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పేశారు సీఎం నితీశ్‌కుమార్. ఆర్జేడీ, కాంగ్రెస్‌ సపోర్ట్‌తో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లలో ఉన్నారాయన.

Bihar Political Crisis: బీజేపీతో జేడీయూ తెగతెంపులు.. కీలక ప్రకటన చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్
Bihar Political Crisis
Follow us on

బీహార్‌లో పొలిటికల్‌ డ్రామా ఊపందుకుంది. బీజేపీతో కటీఫ్‌ చెప్పారు సీఎం నితీష్‌. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం నితీష్ కుమార్‌ ఈ ప్రకటన చేశారు. బీజేపీ మోసం చేసిందని జేడీయూ నేతలు సమావేశంలో నితీష్ కుమార్ ఆరోపించారు. బీజేపీ నుంచి విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ సపోర్ట్‌తో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లలో ఉన్నారాయన. కాసేపట్లో గవర్నర్‌తో సమావేశం కాబోతున్నారు నితీష్‌. . ఇటు జేడీయూ, అటు ఆర్జేడీ కీలక మీటింగ్‌లతో పాట్నాలో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌కు చేరింది. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ కూడా గవర్నర్‌తో భేటీ అవుతున్నారు. నితీష్‌ తన నివాసం నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉంది.

మరోవైపు.. నితీష్ కుమార్‌ స్నేహం వీడిపోకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలు చేసిన ఆఖరి ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఎం నితీష్ కుమార్‌కు ఫోన్‌ చేశారని JDU నేతలు చెప్తున్నారు. తమ సంకీర్ణం కొనసాగించాలని.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కన్వీన్స్‌ చేసేందుకు ప్రయత్నించారని.. సీఎం నితీష్ కుమార్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని అంటున్నారు.

బీజేపీతో విడిపోయి.. కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో నితీష్‌ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు.. కీలకమైన హోంమంత్రి పదవిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

 బీజేపీ కోర్ కమిటీ సమావేశం..

ఇదిలావుంటే.. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ సమావేశం జరిగింది. భిఖుభాయ్ దల్సానియా, రేణు దేవి, మంగళ్ పాండే, నితిన్ నవీన్, అమరేంద్ర ప్రతాప్ సింగ్ మరియు సామ్రాట్ చౌదరి సమావేశం నుండి నిష్క్రమించారు. అదే సమయంలో పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది.

ఐదేళ్లలో రెండోసారి..

బీహార్‌లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ కూటమి విచ్ఛిన్నమైంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం గవర్నర్ ఫాగు సింగ్ చౌహాన్‌ను కలిసేందుకు సీఎం నితీశ్ కుమార్ వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐదేళ్లలో రెండోసారి బీజేపీ, జేడీయూ పొత్తు తెగిపోయింది. గతంలో 2013లో ఇద్దరూ విడిపోయారు. అయితే 2017లో మళ్లీ వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు అందరి చూపు బీజేపీపైనే ఉంది.

రాష్ట్రం అసెంబ్లీలో వివిధ పార్టీల బ‌లాబ‌లాలు గ‌మ‌నిస్తే..

మొత్తం 243

మేజిక్‌ ఫిగర్‌122

NDAకి 122 మంది ఎమ్మెల్యేలు

బీజేపీకి 77మంది ఎమ్మెల్యేలు

జేడీయూకు 45మంది ఎమ్మెల్యేలు

RJDకు 79మంది ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు

సీపీఐఎంఎల్‌ కి 16మంది ఎమ్మెల్యేలు

హిందుస్తానీ అవామ్ మోర్చకు 4 ఎమ్మెల్యేలు

ఎంఐఎంకి 1 ఎమ్మెల్యే

మరిన్ని జాతియ వార్తల కోసం..