గంగా నదిలో పడవ బోల్తా.. 14కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం

బిహార్‌లోని రాఘోపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. అయితే ఈ ప్రమాదంలో గల్లంతైన మరి కొంత మందికోసం రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గంగా నదిలో పడవ బోల్తా.. 14కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
Raghopur Boat Capsize

Updated on: Oct 14, 2026 | 10:06 AM

బిహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దియారా ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగన ఘోర పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ప్రమాదంలో గల్లంతైన ప్రయాణికుల కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

పోలీసుల వివరాల ప్రకారం.. రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ శ్యామ్‌చంద్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒక కుగ్రామం నుంచి మరో కుగ్రామానికి 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న నాటు పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న ప్రయాణికులంతా గంగా నదిలో పడిపోయారు.. అయితే కొందరు ప్రయాణికులు నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు SDRF, NDRF బృందాలను రంగంలోకి దించారు.

దీంతో నీటమునిగిన కొందరు ప్రయాణికులను రక్షించిన రెస్క్యూ సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. గల్లంతైన మృతదేహాల కోసం సాహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే మృతుల్లో 15 ఏళ్ల వయసున్న మైనర్లే 11 మంది ఉన్నట్టు వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ స్పష్టం చేశారు. అయితే స్థానికంగా నైట్‌ టైం బోట్‌ జర్నీపై ఆంక్షలు ఉన్నాయని.. నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరుగుతుందని తెలిపారు.

రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా

మరోవైపు ఈ పడవ ప్రమాదంపై సీఎం సామ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ఒక్కో కుటుంబానికి రూ. రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు, రాఘోపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తేజస్వి యాదవ్ సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పోస్ట్ చూడండి..

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

ఇదిలా ఉండగా ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

పోస్ట్ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్డక క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us