బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్లు ఎవరంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Oct 11, 2020 | 5:39 PM

బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తదితరులతో కూడిన మొత్తం 30 మంది పేర్ల లిస్టును సమర్పించింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మరికొంతమంది కూడా ఈ జాబితాలో […]

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్లు ఎవరంటే ?
Follow us on

బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తదితరులతో కూడిన మొత్తం 30 మంది పేర్ల లిస్టును సమర్పించింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మరికొంతమంది కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కో దశలో రెండు ర్యాలీల చొప్పున రాహుల్ మొత్తం ఆరు ర్యాలీల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 15 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది.