బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్..ఈసీ త్వరలో ప్రకటించనుంది. ఇందులో భాగంగా డిప్యూటీ ఎలెక్షన్ కమిషనర్లు సుదీప్ జైన్, చంద్రభూషణ్ కుమార్ సోమవారం బీహార్ ను సందర్శించారు. వీరు రెండు రోజులపాటు రాష్ట్రంలో పలువురు పౌర, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ నార్త్ బీహార్ జిల్లాల అధికారులతో, మంగళవారం పాట్నా సహా మరికొన్ని జిల్లాల అధికారులతో భేటీ అవుతారని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ముఖ్యంగా బీజేపీ బీహార్ లో పాగా వేయడానికి రెడీ అవుతోంది. జేడీ-ఎస్ కి కమలం పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటుపై సన్నాహక చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ నిన్న రాష్ట్రానికి మూడు పెద్ద పైప్ లైన్ ప్రాజెక్టులను లాంచ్ చేసి దేశానికి అంకితం చేశారు. వచ్ఛే 10 రోజుల్లో బీహార్ కి పదహారు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపడతామని ఆయన ప్రకటించారు.