తప్పు చేసి కప్పిపుచ్చుతున్నారా! ఇంతకూ ఈ ఘటనకు బాధ్యులెవరు? ఎవరిపై చర్యలు?

యుద్ధంలో విజయం కోసం ముందుగా బలి ఇస్తారు. కాని, ఇక్కడ విజయం తరువాత బలి జరిగింది. ఓవైపు.. తొక్కిసలాట జరిగిందని తెలుసు. అప్పటికే కొందరి ప్రాణాలు పోయాయని తెలుసు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య మరికొందరు కొట్టుమిట్టాడుతున్నారనీ తెలుసు. అయినా సరే.. విజయోత్సవ కార్యక్రమం జరిగింది. మనసుందా అసలు? సంబరాలు చేసుకోవాల్సిన సమయమా అది?

తప్పు చేసి కప్పిపుచ్చుతున్నారా! ఇంతకూ ఈ ఘటనకు బాధ్యులెవరు? ఎవరిపై చర్యలు?
Bengaluru Stampede

Updated on: Jun 05, 2025 | 9:49 PM

యుద్ధంలో విజయం కోసం ముందుగా బలి ఇస్తారు. కాని, ఇక్కడ విజయం తరువాత బలి జరిగింది. అది కూడా నరబలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వేడుక ఎలా చేసుకోవాలనిపించింది? ఓవైపు.. తొక్కిసలాట జరిగిందని తెలుసు. అప్పటికే కొందరి ప్రాణాలు పోయాయని తెలుసు. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య మరికొందరు కొట్టుమిట్టాడుతున్నారనీ తెలుసు. అయినా సరే.. విజయోత్సవ కార్యక్రమం జరిగింది. మనసుందా అసలు? సంబరాలు చేసుకోవాల్సిన సమయమా అది? చుట్టూ కోలాహలం. ఎక్కడ చూసినా సంబరాలు. ఐపీఎల్ కప్ విజయంతో ఆర్సీబీ అభిమానుల విజిల్స్, అరుపులు, డ్యాన్సులు.. భలే సరదాగా అనిపించింది దివ్యాన్షికి. ఆ చిన్నారి వయసు 13 ఏళ్లు. సహజంగానే ఆ అల్లరిని ఎంజాయ్‌ చేసే వయసు కదా. వాళ్లను చూస్తూ తను కూడా కేరింతలు కొట్టింది చిన్నస్వామి స్టేడియం బయట. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి ఊపిరి ఆడడం కష్టమైంది. పెదాలపై నవ్వు ఆగిపోయింది. గుండెలను నొక్కేస్తున్నారెవరో. చిట్టి చేతులతో నెడదామా అంటే.. అప్పుడే గట్టిపడుతున్న రెక్కలు కదా… బలం చాల్లేదు. ఏడుపు తన్నుకొచ్చింది. ఇదివరకెప్పుడు ఎదురవని అనుభవం కదా. అసలు ఊపిరి ఆగిపోవడం అంటే ఏంటో, ఆఖరి శ్వాస తీసుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలీదు కదా ఆ పాపకి. బట్‌.. ఒక ధైర్యం. పక్కనే అమ్మ, నాన్న, అత్త ఉన్నారని. తనకేం కాదులే అని. అరవాలనుకుంది అమ్మా, నాన్నా, అత్తా.. ప్లీజ్‌ ఇక ఇంటికెళ్లిపోదాం అని. కాని, ఊపిరి ఆడితేనే కదూ అరిచేది....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి