Viral: ఎయిర్‌పోర్ట్‌లో తత్తరపాటుకు గురైన ప్రయాణీకుడు.. తీరా అనుమానమొచ్చి చెక్ చేయగా..

|

Mar 25, 2023 | 8:56 PM

పైకేమో టిప్‌టాప్‌గా డ్రెస్ వేసుకున్నాడు. కానీ కాళ్లకు మాత్రం చెప్పులు ధరించాడు. వచ్చిందేమో ఇండిగో ఫ్లైట్..

Viral: ఎయిర్‌పోర్ట్‌లో తత్తరపాటుకు గురైన ప్రయాణీకుడు.. తీరా అనుమానమొచ్చి చెక్ చేయగా..
Airport Checking
Follow us on

పైకేమో టిప్‌టాప్‌గా డ్రెస్ వేసుకున్నాడు. కానీ కాళ్లకు మాత్రం చెప్పులు ధరించాడు. వచ్చిందేమో ఇండిగో ఫ్లైట్.. బ్యాంకాక్ నుంచి.. అదేంటీ.! మీరూ అనుమానపడుతున్నారా.! అవునండీ.. కస్టమ్స్ ఆఫీసర్లకు కూడా సదరు ప్రయాణీకుడిపై నిజంగానే డౌట్ వచ్చింది. అతడ్ని తనిఖీ చేసేందుకు ఆపు చేసి.. క్షుణ్ణంగా చెక్ చేశారు. అంతే! ఒక్కసారిగా అధికారుల మైండ్ బ్లాంక్ అయింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా గోల్డ్‌ను రవాణా చేస్తోన్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సదరు వ్యక్తి ఇండిగో ఫ్లైట్‌లో బ్యాంకాక్ నుంచి బెంగళూరు రాగా.. తాను వేసుకొచ్చిన చెప్పులలో చాలా తెలివిగా బంగారాన్ని పెట్టాడు. అయితే అధికారులకు అతడిపై అనుమానమొచ్చి.. చెక్ చేయడంతో చెప్పుల్లో, మలద్వారంలో దాచిపెట్టిన గోల్డ్ స్కానర్లకు చిక్కింది. ఒక కేజీ గోల్డ్‌ను అతడు అక్రమ రవాణా చేస్తుండగా.. దీని విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ. 69.4 లక్షలు ఉంటుందని అంచనా. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.