పుట్టినరోజు నాడే విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన బర్త్‌డే కేక్! తల్లిదండ్రుల పరిస్థితి విషమం..

|

Oct 08, 2024 | 2:31 PM

స్విగ్గీ డెలివరీ బాయ్ కేక్‌ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో భార్య, బిడ్డతో కలిసి కేక్ తిన్నారు. ఈ కేక్ తిన్న తర్వాత ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. తొలుత అస్వస్థతకు గురైన ఐదేళ్ల చిన్నారి ధీరజ్ వైద్య చికిత్సలకు స్పందించకపోవడంతో మృతి చెందాడు. తల్లిదండ్రుల పరిస్థితి

పుట్టినరోజు నాడే విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన బర్త్‌డే కేక్! తల్లిదండ్రుల పరిస్థితి విషమం..
Five Year Old Boy Died After Eating Cake
Follow us on

కొడుకు పుట్టిన రోజును ఇంటిల్లిపాది సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి బర్త్‌డే కేక్‌ కట్‌ చేయించి ఒకరికొకరు ఆనందంగా తినిపించుకున్నారు. కానీ, వాళ్లకు తెలియదు.. బర్త్‌డే కోసం తెచ్చిన కేకే తమ కుమారుడి పాలి మృత్యుపాశంగా మారుతుందని.. బేకరీ నుంచి స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ చేసిన కేక్‌ తిన్న చిన్నారి మృతి చెందాడు. ఇంట్లోని వారంతా అస్వస్థతకు గురయ్యారు.. బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదేళ్ల చిన్నారి పుట్టిన రోజునాడే బర్త్‌డే కేక్‌ తిని మరణించటం పట్ల ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడు కేక్ తిని మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు, తండ్రి, తల్లి, బిడ్డ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. స్విగ్గీ డెలివరీ బాయ్ కేక్‌ని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో భార్య, బిడ్డతో కలిసి కేక్ తిన్నారు. ఈ కేక్ తిన్న తర్వాత ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. తొలుత అస్వస్థతకు గురైన ఐదేళ్ల చిన్నారి ధీరజ్ వైద్య చికిత్సలకు స్పందించకపోవడంతో మృతి చెందాడు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కేక్‌ను తిన్న కుటుంబసభ్యుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలుసుకున్న ఇరుగుపొరుగువారు, స్థానికులు కేపీ అగ్రహార పోలీసులకు సమాచారం అందించారు. కేక్ కొనుగోలు చేసిన బేకరీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..