Tenth Student: 14వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్ధి.. అలా దొరికిపోవడంతో..

పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుపడ్డ పదో తరగతి విద్యార్ధి మంగళవారం (నవంబర్‌ 8) అపార్ట్‌మెంట్‌పై నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Tenth Student: 14వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్ధి.. అలా దొరికిపోవడంతో..
tenth class student suicide in Bengaluru

Updated on: Nov 09, 2022 | 8:59 PM

పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుపడ్డ పదో తరగతి విద్యార్ధి మంగళవారం (నవంబర్‌ 8) అపార్ట్‌మెంట్‌పై నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన మీన్‌ ఖాన్‌ (16) అనే విద్యార్ధి హెడ్తేనగర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఐతే ఇంగ్లిష్‌ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడటంతో టీచర్‌ క్లాస్‌ బయట నిలబెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్ధి ఆర్‌ఆర్‌ సిగ్‌నేచర్‌లోని బాలాజీ లేఔట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన 14వ అంతస్తుపైకి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు బాలుడిని కాపాడేందుకు భవనంపైకి చేరుకున్నారు.

ఐతే అప్పటికే కిందికి దూకిన విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి వద్ద లభ్యమైన ఐడీ కార్డు ఆధారంగా స్కూల్‌ యాజమన్యానికి తెలియజేశారు. విషయం తెలుసుకున్న అభ్యర్ధులు తమకు ఒక్కడే కుమారుడని, బాగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకున్నామని, అంతలోనే మమ్మల్ని వదిలేసిపోయాడని కుమారుడి మృత దేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.