
విమానాశ్రయానికి వెళ్లినప్పుడు చెకింగ్ పూర్తయ్యాక విమానం ఎక్కే వరకు గంటల తరబడి వేచి ఉండటం అందరికీ కాస్త విసుగు కలిగించే విషయమే. కానీ, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వెళ్లే ప్రయాణికులకు ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులను ఆకర్షించేందుకు, ముఖ్యంగా జెన్-జీ (Gen-Z) యువత ఆకట్టుకునేందుకు వారి అభిరుచులకు అనుగుణంగా టెర్మినల్-2లో సరికొత్త హంగులతో గేట్-జెడ్ ను సిద్ధం చేశారు. ఇది సాధారణ వెయిటింగ్ ఏరియాలకు భిన్నంగా ఉంటుంది. ప్రయాణికులు తమ బోర్డింగ్ సమయం వరకు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో ప్రధాన ఆకర్షణలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Bengaluru Airport Gate Z
ఏంటి ఈ ‘గేట్-జెడ్’ ప్రత్యేకత?
గేమింగ్ జోన్ లో అత్యాధునిక వీడియో గేమ్స్, ప్లే స్టేషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గేమర్స్ తమ ఫేవరెట్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేయవచ్చు. హై-స్పీడ్ వైఫై, వర్క్ స్టేషన్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు లేదా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నవారి కోసం ప్రత్యేక సైలెంట్ జోన్లు, ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఫోటోజెనిక్ స్పాట్స్ లో సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోలు పెట్టేవారి కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామబుల్ బ్యాక్‌గ్రౌండ్స్‌ను డిజైన్ చేశారు. పాతకాలం నాటి కుర్చీలు కాకుండా, రిలాక్స్ అవ్వడానికి అనువైన బీన్ బ్యాగ్స్, డిజైనర్ సోఫాలు ఉన్నాయి.
జెన్-జీ కోసమే ప్రత్యేకంగా..
ప్రస్తుత కాలంలో యువత టెక్నాలజీకి, క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వారి లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా మ్యూజిక్, ఆర్ట్, టెక్నాలజీల సమ్మేళనంగా ఈ జోన్‌ను తీర్చిదిద్దారు. కేవలం విమానం కోసం ఎదురుచూడటం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని ఒక అనుభవంగా మార్చడమే ఈ గేట్-జెడ్ ముఖ్య ఉద్దేశ్యం. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్ ఎప్పుడూ ముందుంటుందని. గేట్-జెడ్ ద్వారా యువ ప్రయాణికులకు ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నామని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. మీరు కూడా త్వరలో బెంగళూరు నుంచి జర్నీ ప్లాన్ చేస్తుంటే, టెర్మినల్-2లోని ఈ గేట్-జెడ్‌ను ఓసారి విజిట్ చేయండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.