అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మంత్రిపై వేటు పడింది. పశ్చిమ బెంగాల్‌లో స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన పార్థ ఛటర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈడీ అరెస్ట్ తర్వాత పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ పెరిగింది. మరోవైపు ఇవాళ మమతా బెనర్జీ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జరిగిన కొద్ది సేపటికే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్థ ఛటర్జీ మమతా బెనర్జీ ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఉన్నారు. అంతేకాదు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీలో కీలకమైన నేతగా పేరుంది. ఈ శాఖను మమతా బెనర్జీ స్వయంగా చూసుకుంటారు.
50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు
జూలై 23న కేంద్ర ఏజెన్సీ ఈడీ (Enforcement Directorate) అతన్ని అరెస్టు చేసింది. అర్పితా ముఖర్జీ అరెస్టుకు ముందు ఆమె నివాసం నుంచి దాదాపు రూ.21 కోట్లను ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. అర్పితా ముఖర్జీ TMC నాయకుడు పార్థ ఛటర్జీకి సన్నిహితురాలు. బుధవారం కూడా ముఖర్జీ నివాసాలపై ఈడీ దాడులు చేసింది. ఈ క్రమంలో రూ.29 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏజెన్సీ అనేక ఆస్తుల పత్రాలు, మూడు కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం జరిగినప్పుడు పార్థ ఛటర్జీ విద్యాశాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన నుంచి ఈ శాఖను సీఎం మమతా బెనర్జీ తన వద్ద పెట్టుకున్నారు. స్కూల్ సర్వీస్ కమిషన్ టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది.
Partha Chatterjee, accused in West Bengal SSC recruitment scam, relieved of his duties as Minister in Charge of his Departments with effect from 28th July: Government of West Bengal pic.twitter.com/12Asu6b4L8
— ANI (@ANI) July 28, 2022
ఏం జరిగిందంటే..
నాలుగు రోజులు క్రితం అర్పిత ఇంట్లో రూ. 22 కోట్లు పట్టుబడగా.. ఇప్పుడు మరో ఇంట్లో రూ.21కోట్లు దొరికాయి. వీళ్లకు ఇంకెన్ని ఇళ్లు ఉన్నాయి.. వాటిలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయన్న అనుమానాలతో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పిత ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు దొరకడం.. ఇప్పుడు ఆయనపై మమతా వేటు వేయడం సంచలనంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..