ఆమెవన్నీ నిరాధార ఆరోపణలు, నటి పాయల్ ఘోష్ పై అనురాగ్ కశ్యప్ ఫైర్

తనపై బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలను సినీ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కొట్టి పారేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ నిరాధారమైనవని,తన నోరు నొక్కడానికే ఆమె తనపై నిందలు వేస్తోందని ట్వీట్ చేశారు. మహిళలను తాను గౌరవిస్తానని.

ఆమెవన్నీ నిరాధార ఆరోపణలు, నటి పాయల్ ఘోష్ పై అనురాగ్ కశ్యప్ ఫైర్

Edited By:

Updated on: Sep 20, 2020 | 12:20 PM

తనపై బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలను సినీ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కొట్టి పారేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ నిరాధారమైనవని,తన నోరు నొక్కడానికే ఆమె తనపై నిందలు వేస్తోందని ట్వీట్ చేశారు. మహిళలను తాను గౌరవిస్తానని. ఏ హీరోయిన్ కూడా తనపట్ల ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. కాగా ‘పటేల్ కీ పంజాబీ షాదీ’, ‘ప్రయాణం’ వంటి మూవీల్లో నటించిన పాయల్ ఘోష్ తనను అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా ట్వీట్ చేస్తూ.. తనకు భద్రత లేకుండాపోయిందని, కాపాడాలని కోరింది. అటు-ఆమె చేసిన ఆరోపణలపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ.. పాయల్ ఘోష్ వివరణాత్మక ఫిర్యాదును పంపిన పక్షంలో అనురాగ్ కశ్యప్ విషయంలో చర్య తీసుకుంటామని హామీ ఇఛ్చారు.