Bajrang Dal: వాత్స్యాయనుడు రచించిన కామసూత్ర హిందూ దేవతలను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు కామ సూత్ర పుస్తకాలను తగలబెట్టారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో శనివారం జరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన కొందరు బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు నగరంలోని ఓ బుల్ స్టాల్ ముందు కామసూత్ర పుస్తకాలను దగ్దం చేశారు. ఈ పుస్తకంలో ఉన్న ఫొటోలు అసభ్యకరమైన రీతిలో ఉన్నాయని ఆరోపించిన కార్యకర్తలు.. ఆ ఫొటోలు హిందూ దేవతల రూపాలను పోలిఉన్నాయని దుకాణం ముందు పుస్తకాలను కుప్పలా పోసి అంటించారు.
పుస్తకాలను దగ్దం చేస్తోన్న సమయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీ రామ్, హర్ హర్ మహదేవ్ అంటూ నినాదాలు చేశారు. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పుస్తకాలను తగలబెట్టిన కార్యకర్తలు అంతటితో ఆగకుండా మరోసారి పుస్తకాలను అమ్మితే ఏకంగా దుకాణాన్నే తగలబెట్టడానికి సైతం వెనకాడబోమని షాపు యజమానిని హెచ్చరించారు. పుస్తకంలో ఉన్న చిత్రాలను చూపిస్తూ.. కామసూత్రపై తమకున్న అభ్యంతరాలను కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అటు బుక్ స్టోర్ యాజమాన్యం కానీ, ఇటు బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. మరి ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Vatsayana’s Kaamsutra has been a pride of India for centuries as has been the sculptures of Ajanta Ellora Khajuraho and Konark. So what do we expect? Bamiyan Buddha style demolition of all Indian heritage? 2/N pic.twitter.com/HX4vwHWlOV
— DP (@dpbhattaET) August 28, 2021
SBI Offer: మీరు హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ ఆఫర్ ఆగస్టు 31తో ముగియనుంది..!