రామ రామా ! కోవిడ్ ఎఫెక్ట్, అయోధ్యలో ఈ సారి శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు, భక్తుల్లోనిరాశ

| Edited By: Phani CH

Apr 18, 2021 | 7:36 PM

కోవిడ్ విజృంభణ కారణంగా ఈ సారి అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు అయోధ్య జిల్లా అధికారులు ప్రకటించారు.  ఈ నెల 21 న ఇక్కడ జరిగే రామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని  కుంభ్ మేళా భక్తులు లక్షలాది మంది ఆశించారు.

రామ రామా ! కోవిడ్ ఎఫెక్ట్, అయోధ్యలో ఈ సారి శ్రీరామనవమి ఉత్సవాలు రద్దు, భక్తుల్లోనిరాశ
Ramanavami Celebrations
Follow us on

కోవిడ్ విజృంభణ కారణంగా ఈ సారి అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు అయోధ్య జిల్లా అధికారులు ప్రకటించారు.  ఈ నెల 21 న ఇక్కడ జరిగే రామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని  కుంభ్ మేళా భక్తులు లక్షలాది మంది ఆశించారు. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఈ సెలబ్రేషన్స్ ను రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కుంభ్ మేళాను 30 రోజులకే కుదించిన సంగతి విదితమే. దాదాపు నాలుగు నెలలపాటు సాగాల్సిన ఈ మేళాను మధ్యలోనే విరమిస్తున్నారు.  రామనవమి రోజున పూజలు, ప్రార్థనలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆ రోజున రామ జన్మ భూమి ఆలయాన్ని సందర్శిస్తారు. కానీ ఆ రోజున అయోధ్య బోర్డర్స్ ను మూసి వేస్తామని, భక్తులను గానీ, కుంభ్ మేళా యాత్రికులను గానీ అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు వెల్లడించారు. భక్తులు రామనవమి ఉత్సవాలను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని, ఆలయాలను కూడా పెద్ద సంఖ్యలో  సందర్శించరాదని వారు స్పష్టం చేశారు.

కరోనా చైన్ ను బ్రేక్ చేయాలన్నది తమ ఉద్దేశమని, ఇందులో భాగంగా అయోధ్యలో అన్ని సామూహిక కార్యక్రమాలు జరగకుండా తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ కుమార్ ఝా తెలిపారు. రామనవమి ఉత్సవాలు అత్యంత నిరాడంబరంగా జరుగుతాయని అన్నారు. ఎప్పుడూ సరయూ నదిలో స్నానాలు చేసేందుకు ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు  వస్తుంటారు. కానీ ఈ సారి ఆంక్షల కారణంగా ఈ నదీ తీరం భక్తులు, జనాలు లేక వెలవెలబోతోంది. అన్నీ ఎంట్రీ పాయింట్ల వద్ద బ్యారికేడ్లతో కట్టుదిట్టం చేసేశారు. ఈ ఏడాది రామనవమి రోజున ఒకే ఒక పూజారి, కొందరు పోలీసులు ఉంటారని, అసలు ఆర్భాటంగా పూజలు జరగబోవని  రామజన్మ భూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. కరోనా పాండమిక్ కారణంగా అయోధ్యలో వరుసగా ఇలా రెండోసారి కూడా రామనవమి ఉత్సవాలు రద్దు చేయడం విశేషం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఏపీలో కరోనా మరణ మృదంగం.. గడిచిన 24 గంటల్లో 22 మరణాలు.. ఆ జిల్లాలో అత్యధిక కేసులు నమోదు.!

మా రాష్ట్రానికి 5. 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపండి, ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ