Uttar Pradesh: హనుమంతులు వారంటే ఆ మాత్రం ఉంటుంది మరి.. ఏకంగా పోలీస్‌స్టేషన్ ని తనిఖీ చేసేస్తుందిగా

|

Aug 16, 2024 | 3:34 PM

అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఒక వానరం SHO దేవేంద్ర కుమార్ కుర్చీపై కూర్చుంది. తర్వాత అక్కడ స్టేషన్ లో ఉన్న వారిని ఎంతో ప్రేమగా చూసింది. SHO సాహెబ్ కూడా తన కుర్చీలో కూర్చున్న వనరానికి సెల్యూట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

Uttar Pradesh: హనుమంతులు వారంటే ఆ మాత్రం ఉంటుంది మరి.. ఏకంగా పోలీస్‌స్టేషన్ ని తనిఖీ చేసేస్తుందిగా
Viral News
Follow us on

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతోపాటు దేశభక్తి నినాదాలు ప్రతిధ్వనించాయి. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో, కూడళ్ళలో, స్కూల్స్ లో త్రివర్ణ పతాకం ఎగరవేశారు. అయోధ్య పురి నిలయమైన ఉత్తరప్రదేశ్‌లోని దేవాలయాలు మఠాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసారు. అయితే అయోధ్యలో జరిగిన ఒక ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది తెలిసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఒక వానరం SHO దేవేంద్ర కుమార్ కుర్చీపై కూర్చుంది. తర్వాత అక్కడ స్టేషన్ లో ఉన్న వారిని ఎంతో ప్రేమగా చూసింది. SHO సాహెబ్ కూడా తన కుర్చీలో కూర్చున్న వనరానికి సెల్యూట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

SHO దేవేంద్ర పాండే, వానరం ఉన్న చిత్రాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. చిత్రంలో కోతి కుర్చీ హ్యాండిల్‌ను పట్టుకుని ఉంది. ముందు ఒక టేబుల్, దాని మీద కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఒక పోలీసు అధికారి వైపు వానరం చూస్తుండగా ఆ పోలీసు అధికారి దానికి సెల్యూట్ చేస్తున్నాడు. SHO కి ఆఫీస్ పనులన్నింటికీ కోతి ఆదేశాలు ఇస్తున్నట్లుంది. రామనగరి అయోధ్యలో చాలా కోతులు ఉన్నాయి. ప్రజలు వాటిని హనుమంతునితో సమానంగా భావిస్తారు.. గౌరవంగా చూస్తారు. వాటిని హనుమాన్ అంటూ పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

హనుమంతుడి భక్తుడు SHO

ఈ విషయంపై రామజన్మభూమి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దేవేంద్ర పాండే మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్‌లో జెండా ఎగురవేసిన తర్వాత.. తమ సిబ్బంది తో కుర్చీ వద్దకు వచ్చేసరికి, అప్పటికే ఒక వానరం తన కుర్చీలో కూర్చొని ఉంది. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం అయోధ్యలోని కోతులను హనుమంతుడి స్వరూపంగా భావిస్తారు. వాటిని పూజిస్తారు. దీంతో తమ స్టేషన్ కు వచ్చిన వానరాన్ని హనుమంతుడిగా భావించి చూసి నమస్కారం చేసి పాదాభివందనం చేసాము. ఇది మాత్రమే కాదు.. దేవేంద్ర పాండే తాను హనుమంతుని భక్తుడిని అంటూ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన సుతుడు హనుమంతుని ఆశీర్వాదం పొందడం దేవుని కృప అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..