అయోధ్య కేసు.. రివ్యూ పిటిషన్లపై ‘ సుప్రీం ‘ అంతర్గత విచారణ

|

Dec 11, 2019 | 7:28 PM

అయోధ్య కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో అంతర్గత విచారణ జరగనుంది. వీటిపై అయిదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జడ్జీల చాంబర్ లో విచారణ జరుపుతుంది. రివ్యూ పిటిషన్లపై అంతర్గతంగా విచారణ జరపాలా లేక బహిరంగంగా కోర్టులోనే జరపాలా అని మొదట యోచించినప్పటికీ… చివరకు చాంబర్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. ధర్మాసనంలో మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానే జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించారు. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ […]

అయోధ్య కేసు.. రివ్యూ పిటిషన్లపై  సుప్రీం  అంతర్గత విచారణ
Follow us on

అయోధ్య కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో అంతర్గత విచారణ జరగనుంది. వీటిపై అయిదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జడ్జీల చాంబర్ లో విచారణ జరుపుతుంది. రివ్యూ పిటిషన్లపై అంతర్గతంగా విచారణ జరపాలా లేక బహిరంగంగా కోర్టులోనే జరపాలా అని మొదట యోచించినప్పటికీ… చివరకు చాంబర్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. ధర్మాసనంలో మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానే జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించారు. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ వీటిపై విచారణ జరపనుంది. ఇప్పటివరకు అయోధ్య కేసు తీర్పును సమీక్షించాలని కోరుతూ 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. .